Devotional

Mangalavaram niyamalu:మంగళవారం ఖచ్చితంగా చేయవలసిన పనులు.. చేయకూడని పనులు

Mangalavaram niyamalu : మంగళవారం రోజున కొన్ని పనులను చేయకూడదని…కొన్ని పనులను చేయవచ్చని మన పెద్దలు చెప్పుతూ ఉంటారు. వాటి గురించి తెలుసుకుందాం.

మంగళవారం చేయకూడని పనులు
మంగళ వారం కుజునికి సంకేతం. కుజుడు ధరిత్రీ పుత్రుడు. కుజగ్రహం భూమి పరిమాణం కన్నా దాదాపు సగం చిన్నదిగా ఉంటుంది. భూమిపై నివసించే వారికి కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కుజుడు కలహాలకు, ప్రమాదాలకు, నష్టాలకు కారకుడు. కనుకే కుజగ్రహ ప్రభావం ఉండే మంగళ వారంనాడు శుభ కార్యాలను సాధారణంగా తలపెట్టరు.

ఈ రోజున గోళ్ళు కత్తిరించడం, క్షవరం మొదలైన పనులు చేయకూడదు. మంగళ వారం నాడు అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రావడం చాలాకష్టం. అప్పుతీసుకున్నట్లైతే అది అనేక బాధలకు కారణమై తీరకుండా మిగిలే ప్రమాదం ఉంది. దైవ కార్యాలకూ, విద్యా, వైద్య పరమైన ఋణాలకు ఇది వర్తించదు.

మంగళవారం నాడు కొత్త బట్టలు వేసుకోరాదు. తలంటు పోసుకోరాదు. ముఖ్యమైన ప్రయాణాలు చేయవలసి వస్తే భగవంతుని ధ్యానించి ప్రయాణం సాగించాలి. మంగళవారం ఉపవాసం చేసేవారు రాత్రిపూట ఉప్పు వేసిన పదార్థాలు తినరాదు.

మంగళవారం చేయవలసిన పనులు
మంగళవారం ఆంజనేయుని ధ్యానించడం వల్ల ధైర్యం చేకూరుతుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల కుజగ్రహ ప్రభావం కారణంగా కలిగే అనేక ప్రమాదాలను నివారించవచ్చు. మంగళవారం కాళికాదేవిని ధ్యానించడం వలన శత్రువుల పై జయం కలుగుతుంది. కుజునికి ప్రీతిపాత్రమైన ఎరుపు రంగు దుస్తులు ధరించడం, ఎరుపు రంగు పువ్వులతో ఇష్టదైవాన్ని పూజించడం వల్ల మంచి జరుగుతుంది.

జాతకం లో కుజగ్రహం వక్ర దృష్టితో చూస్తున్నట్లైతే ఎరుపు వస్త్రాలు ధరించరాదు. హనుమంతుడిని సిందూరం తో పూజించడం వల్ల లేదా సుబ్రమణ్య స్వామి కి పదకొండు ప్రదక్షిణలు చేయడం వల్ల దోష ప్రభావం తగ్గుతుంది.

కాబట్టి నమ్మకం ఉన్నవారు వీటిని పాటించండి. అయితే మనలో చాలా మందికి కొన్ని ఆచారాల పట్ల నమ్మకం ఉండదు. కానీ మన పెద్దవారు పెట్టిన ప్రతి ఆచారంలోను సైన్స్ కూడా దాగి ఉంది. కాబట్టి కాస్త ఆలోచించండి. మనలను చూసి మన పిల్లలు నెరుచుకుంటారు. ఈ విషయం గుర్తు పెట్టుకోవాలి.