Beauty Tips

Face Glow Tips: ముఖం మచ్చలు, ముడతలు లేకుండా కళకళలాడాలంటే ఈ ఫేస్‌ప్యాక్ ట్రై చేయండి

Potato Home Remedies In Telugu : మనలో చాలా మందికి బంగాళదుంప అంటే చాలా ఇష్టం. అయితే బంగాళదుంపలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బంగాళదుంప చర్మ సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

ముఖం మీద ముడతలు,మచ్చలు,మొటిమలు లేకుండా అందంగా కాంతివంతంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అలా కోరుకోవడం కూడా సహజమే. అయితే దీని కోసం వేల కొద్ది డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లో ఉండే వస్తువులతో సులభంగా నల్లని మచ్చలు, ముడతలు, మొటిమలు తొలగించుకోవచ్చు.

ఇంటి చిట్కాలను జాగ్రత్తగా ఫాలో అయితే మంచి ఫలితాలను అందిస్తాయి. కాస్త ఓపికగా చేయాలి. అప్పుడు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కాంతివంతమైన మెరిసే ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు. దీని. కోసం కేవలం నాలుగు ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం. ఇవన్నీ మనకు రెగ్యులర్ గా అందుబాటులో ఉండేవి.

2 స్పూన్ల బంగాళాదుంప రసంలో ఒక స్పూన్ నిమ్మరసం,ఒక స్పూన్ గ్లిజరిన్,ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా కలిపి ముఖానికి రాసి పావుగంట తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.

బంగాళాదుంప రసంలో ఉన్న పోషకాలు చర్మ సమస్యలను తగ్గించటానికి సహాయపడతాయి. సన్‌టాన్ నుండి డార్క్ సర్కిల్ వరకు అన్నీ రకాల చర్మ సమస్యలను తగ్గించటానికి బంగాళాదుంప చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చర్మం మీద మృత కణాలను తొలగించి ముఖం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.

నిమ్మరసంలో ఉన్న పోషకాలు ముడతలు, ఫైన్ లైన్ సమస్యలు సులభంగా తగ్గుతాయి. ఇందులో ఉండే యాంటీ ఏజింగ్ గుణాలు చర్మం ముడతలను తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. నిమ్మకాయలో ఉండే సి విటమిన్ కొలాజన్ ఉత్పత్తిని పెంచి చర్మం మృధువుగా , కాంతి వంతంగా మారేలా చేస్తుంది.

కొబ్బరి నూనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, లినోలిక్ యాసిడ్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది మీ చర్మానికి సహజ మాయిశ్చరైజర్ గా పనిచేసి చర్మాన్ని మృదువుగా కాంతివంతంగా చేసి చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడుతుంది,కొబ్బరి నూనె చర్మంలో కొల్లాజెన్ ను పెంచడం ద్వారా ముడతలను తగ్గిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.