Beauty Tips

Face Glow Tips:బొప్పాయితో ఇలా చేస్తే చాలు…. నిగనిగలాడే చర్మం మీసొంతం!

Papaya Benefits For Skin: బొప్పాయిలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఎన్నో బ్యూటీ ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. బొప్పాయిలో ఉండే పపైన్ చర్మం మీద అద్భుతాన్ని చేస్తుంది. ఈ ఎంజైమ్ చర్మాన్ని కాంతివంతం చేసే లక్షణాలను కలిగి ఉంటుంది.

బొప్పాయి సున్నితమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా కూడా పనిచేసి మృత కణాలను,మచ్చలను తొలగించి ముఖం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. చర్మాన్ని యవ్వనంగా మరియు మెరుపుతో ఆరోగ్యంగా ఉంచటంలో సహాయపడుతుంది.

బొప్పాయి గుజ్జులో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాసి 5 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే మొటిమలు తగ్గటమే కాకుండా చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.

బొప్పాయి గుజ్జులో కొద్దిగా పచ్చిపాలు, తేనె, పసుపు వేసి బాగా కలిపి ముఖానికి రాసి 5 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయటం వలన చర్మానికి అవసరమైన తేమ, పోష‌కాలు అంది.ముఖం అందంగా, యవ్వనంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ట్యానింగ్ ను తొలగించడానికి కూడా ఈ ప్యాక్ ఉప‌యోగ‌ప‌డుతుంది.

బొప్పాయిగుజ్జులో కొద్దిగా బియ్యంపిండి, నిమ్మరసం వేసి బాగా కలిపి ముఖానికి రాసి 5 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయటం వలన డార్క్ స్పాట్స్ మాయం అయ్యి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.