Beauty Tips

Hair Fall:కలబందను ఇలా రాస్తే.. వద్దన్న జుట్టు పెరగడం గ్యారంటీ…!

Alovera Hair Fall Home Remedies:మన ఇంటి పరిసరాలలో ఉండే మొక్కలు మనకు ఎన్నో రకాలుగా సహాయపడతాయి. ఆరోగ్య పరంగా,బ్యూటీ పరంగా ఉపయోగపడతాయి. అయితే వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక వాటిని పెద్దగా పట్టించుకోము.

దాదాపుగా ఈ మధ్య కాలంలో ప్రతి ఇంటిలోనూ కలబంద మొక్క ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చెప్పే చిట్కాను ఫాలో అయితే మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ మధ్యకాలంలో జుట్టు రాలే సమస్య, తెల్ల జుట్టు, చుండ్రు సమస్య చాలా ఎక్కువగా వస్తున్నాయి. వీటిని ప్రారంభ దశలో తగ్గించుకుంటే ఎటువంటి సమస్య ఉండదు. అదే .అశ్రద్ద చేస్తే సమస్య తీవ్రం అవుతుంది.

ఈ సమస్యలను తగ్గించుకోవటానికి మార్కెట్లో దొరికే ఖరీదైన షాంపూలు, నూనెలను వాడవలసిన అవసరం లేదు. మన ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా జుట్టు రాలే సమస్య, తెల్ల జుట్టు, చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు. ఒక బౌల్ లో రెండు స్పూన్ల బియ్యం, అర గ్లాసు నీటిని పోసి ఐదు గంటలు నానబెట్టి బియ్యం నీటిని వడగట్టి పక్కన పెట్టుకోవాలి.

ఆ తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి నీళ్లు కాస్త వేడెక్కాక రెండు టీ స్పూన్ల టీ పొడి వేసి మరిగించి డికాషన్ వడగట్టాలి.
కలబంద ఆకును శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిక్సీ జార్ లో నాలుగు మందార పువ్వులు, కలబంద ముక్కలు వేసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి.

ఈ పేస్ట్ ని ఒక బౌల్ లో తీసుకుని… దానిలో నాలుగు స్పూన్ల టి డికాషన్, నాలుగు స్పూన్ల బియ్యం నీరు,అరస్పూన్ ఆముదం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు బాగా పట్టించి షవర్ Cap పెట్టుకోవాలి. ఒక గంట తర్వాత కుంకుడు కాయలతో తల స్నానం చేయాలి.

ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తే జుట్టు రాలే సమస్య., చుండ్రు తగ్గుతుంది. తెల్ల జుట్టు ప్రారంభ దశలో ఉన్న వారికి ఈ చిట్కా చాలా బాగా సహాయపడుతుంది ఈ విధంగా చేయడం వలన తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. కాబట్టి ఈ చిట్కాను తప్పనిసరిగా ట్రై చేసి జుట్టు రాలే సమస్య,చుండ్రు,తెల్లజుట్టు సమస్య నుండి బయట పడండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.