Beauty Tips

White Hair Turn black:తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మారాలంటే ఏమి చేయాలి? అది కూడా ఖర్చు లేకుండా ..

White Hair Turn Black: ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు సమస్య వచ్చేస్తుంది. చాలా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు రావటంతో బయటకు వెళ్ళటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది.

దాంతో మార్కెట్ లో దొరికే ఉత్పత్తులను వాడటం ప్రారంభిస్తారు. వీటి కారణంగా ఎన్నో రకాల సైడ్ effects వస్తాయి. ముఖ్యంగా జుట్టు రాలే సమస్య వస్తుంది. కాబట్టి మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడటం మానేసి ఇంటి చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది.

Black Tea తెల్లజుట్టును నల్లగా మార్చటంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. బ్లాక్ టీలో అధిక శాతం టానిక్ యాసిడ్ ఉంటుంది, ఇది జుట్టును సహజంగా నల్లగా మార్చడంలో సహాయపడుతుంది. అంతేకాక కెరాటిన్ బూస్ట్‌ను అందించి జుట్టుకు మెరుపుతో ముదురు రంగును ఇస్తుంది.

పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి రెండు స్పూన్ల బ్లాక్ టీ పొడి, ఒక స్పూన్ ఉప్పు వేసి 5 నిమిషాలు మరిగించి వడకట్టాలి. ఈ నీటిని చల్లారబెట్టాలి. చల్లారిన ఈ నీటిని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు బాగా పట్టించి అరగంట అలా వదిలేయాలి.

అరగంట తర్వాత కుంకుడు కాయ లేదా హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. కాబట్టి కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అవ్వండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.