MoviesTollywood news in telugu

Bavagaru Bagunnara Movie:బావగారు బాగున్నారా సినిమాకి పోటీ వచ్చిన సినిమాల పరిస్థితి…?

Bavagaru Bagunnara Movie : మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో మంచి కామెడీ,ఎమోషన్ తో కూడిన మూవీ బావగారూ బాగున్నారా. చక్కటి కామెడీ పండిస్తూ,ఎమోషన్ సీన్స్ లో కూడా అదరగొట్టిన చిరంజీవికి జోడీగా చేసిన రంభ తన గ్లామర్ తో అలరించింది.

బ్రహ్మానందంతో కామెడీ సీన్స్ అయితే ఇక చెప్పక్కర్లేదు. నాగబాబు నిర్మించిన ఈ మూవీ 1998ఏప్రియల్ 9న రిలీజయింది. ఈ మూవీకి కి జయంత్ సి పరాన్జీ దర్శకుడు. మణిశర్మ చక్కటి బాణీలు సమకూర్చారు. 54సెంటర్స్ లో 100డేస్ ఆడిన ఈ సినిమా ఓ సంచలనం సృష్టించింది.

ఈ సినిమాకు 13రోజులు ముందుగా మార్చి 27న డాక్టర్ రాజశేఖర్ నటించిన శివయ్య మూవీ రిలీజయింది. సంఘవి,మోనికా బేడీ హీరోయిన్స్. సురేష్ వర్మ బాగానే డైరెక్ట్ చేసిన ఈ మూవీ విజయాన్ని సాధించింది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డాక్టర్ రామానాయుడు నిర్మించిన ఈ మూవీకి మంచి లాభాలే తెచ్చింది.

నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ నటించిన ఆల్ రౌండర్ కూడా ఇదే రోజు రిలీజయింది. సంఘవి హీరోయిన్. అయితే ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు. బావగారూ బాగున్నారా మూవీకి 8రోజుల గ్యాప్ తో బాలయ్య నటించిన యువరత్న రాణా మూవీ ఏప్రియల్ 17న రిలీజయింది. కోటి సాంగ్స్ కి బాలయ్య స్టెప్స్ అలరిస్తాయి. అయితే ఈ మూవీ ప్లాప్ అయింది.

భాగ్యశ్రీ,హీరా హీరోయిన్స్ గా నటించారు. చిరంజీవి సినిమాకు పోటీగా ఏప్రియల్ 24న కింగ్ నాగార్జున హీరోగా ఆటో డ్రైవర్ మూవీ రిలీజ్ యింది. సురేష్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో దీప్తి భట్నాగర్,సిమ్రాన్ హీరోయిన్స్. భారీ అంచలనాలతో వచ్చిన ఈ మూవీ నిరాశ పరిచింది. ఇలా పలు సినిమాలు వచ్చినా బావగారూ బాగున్నారా బ్లాక్ బస్టర్ కొట్టింది. శివయ్య తప్ప మరో సినిమా ఏదీ నిలబడలేదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."