Kitchenvantalu

Nerves weakness:అరస్పూన్ పొడి గ్లాసు పాలలో కలిపి తీసుకుంటే నరాల బలహీనతకు చెక్..

Nerves weakness home remedies in telugu : నరాల బలహీనత అనేది చాలా మందిని వేధిస్తున్న సమస్య. ఈ సమస్య ఉన్నప్పుడు కాళ్లు, చేతులు వణకడం, మాట్లాడే క్రమంలో కండ్ల నుంచి నీరు కారడం. అనుకోని సంఘటనలు చూసినా, విన్నా గుండె దడదడ లాడటం, బరువు లేని వస్తువులు కూడా మోయటానికి శక్తీ లేకపోవడం, రాయాలంటే చేతులు వణకడం తదితర సమస్యలను చూస్తుంటాం.

ఈ నరాల బలహీనత కారణంగా ఏ పని చేయలేక చాలా తొందరగా అలసటకు గురి అవుతారు. ఆహారం లోపం వలన ,ఫిజికల్ గా ఎటువంటి పని చేయకపోయినా,వయస్సు పెరిగే కొద్దీ ఈ నరాల బలహీనత వస్తుంది. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే ఈ నరాల బలహీనత నుంచి బయట పడవచ్చు.

సాధారణంగా నరాల బలహీనత రాగానే చాలా మంది టాబ్లెట్స్ వాడుతూఉంటారు. ఆలా మందులు వాడుతూ ఇంటిలోనే ఒక పొడిని తయారుచేసుకొని వాడితే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. ఈ పొడి కోసం మిక్సీ జార్ లో 5 స్పూన్ల పుచ్చ గింజల పొడి, 5 స్పూన్ల ఆవిసే గింజలు, రెండు బిరియాని ఆకులు వేయాలి.
Biryani leaves health benefits In Telugu
ఆ తర్వాత చిన్న దాల్చిన చెక్క‌, అర స్పూన్ మిరియాలు, పది వాల్ న‌ట్స్‌, మూడు చిన్న ప‌టిక బెల్లం ముక్క‌లు వేసుకుని మెత్త‌గా పొడి చేసుకోవాలి. ఈ పొడిని సీసాలో పోసి ఫ్రిజ్ లో పెడితే 15 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఒక గ్లాస్ గోరువెచ్చని పాలు లేదా గోరువెచ్చని నీటిలో అర స్పూన్ పొడి కలిపి తాగాలి.

ఈ విధంగా తాగటం వలన నరాల బలహీనత తగ్గటమే కాకుండా రోజంతా ఎనర్జీగా ఉంటారు. అలసట లేకుండా ఉంటుంది. సహజసిద్ధమైన పదార్ధాలు కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ పొడిలో వాడిన ఇంగ్రిడియన్స్ లో ఉన్న లక్షణాలు నరాల బలహీనతను తగ్గిస్తాయి. కాస్త ఓపికగా చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.