MoviesTollywood news in telugu

Ramya Krishnan:రమ్య కృష్ణ కెరీర్ లో సంపాదన ఎంతో తెలుసా…?

Ramya Krishnan:రమ్య కృష్ణ దాదాపుగా 30 ఏళ్ల కెరీర్ లో గ్లామర్‌తో పాటు తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. సౌత్ సూపర్ స్టార్‌ రజనీకాంత్‌ జైలర్ సినిమాలో రమ్య కృష్ణ తన నటనతో ఆదరకోట్టింది. ఈ సినిమా సూపర్ హిట్ అయింది.

రజనీకాంత్ నటించిన నరసింహలో నీలాంబరి నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రకు మంచి పేరు వచ్చింది. రజనీకాంత్ సైతం రమ్య కృష్ణ నటన సూపర్ అని కామెంట్ చేసారు. అలాగే బాహుబలిలో రాజమాత శివగామిగా నటించి అందరి దృష్టిని ఆకర్షించింది రమ్యకృష్ణ.

గత 30 ఏళ్లుగా ఒక వైపు సినిమాలు,మరో వైపు సీరియల్స్‌లో బిజీగా ఉన్న రమ్యకృష్ణ ఆస్తుల విలువ దాదాపుగా రూ. 98 కోట్ల వరకు ఉంటుందని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. telugu,కన్నడ,తమిళ రంగాలలో మంచి పేరును సంపాదించింది.

ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్న రమ్యకృష్ణ సపోర్టింగ్ రోల్స్ ద్వారా అభిమానులను అలరిస్తుంది. రమ్యకృష్ణ భర్త కృష్ణవంశీ డైరెక్టర్‌గా వర్క్ చేసిన రంగమార్తాండ సినిమాలో యాక్ట్ చేసింది.

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవరా చిత్రంలో ఆమె ఎన్టీఆర్‌కు అత్త పాత్రలో రమ్య కృష్ణ నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో రమ్య కృష్ణ పాత్ర చాలా కీలకం అని వార్తలు వస్తున్నాయి.