MoviesTollywood news in telugu

Nagarjuna Rejected movies: ఇన్నేళ్ల కెరీర్‌లో నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాలు ఎన్ని ఉన్నాయో…?

Nagarjuna Rejected movies:Nagarjuna rejected movies : అక్కినేని నాగేశ్వరరావు కొడుకుగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున చాలా తక్కువ సమయంలోనే సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. టాలీవుడ్ లో మన్మధుడుగా పేరు తెచ్చుకున్న నాగార్జున ‘శివ’ సినిమాతో కొత్త ట్రెండ్ ని సృష్టించాడు. బాలకృష్ణ మరియు చిరంజీవిలతో పోల్చితే నాగార్జునకు హిట్ సినిమాలు చాలా తక్కువ. అయితే నాగార్జున తన కెరీర్లో కొన్ని సూపర్ హిట్ సినిమాలను తిరస్కరించారు. నాగార్జున తిరస్కరించిన 6 బ్లాక్ బస్టర్ సినిమాల గురించి వివరంగా తెలుసుకుందాం.

ఘర్షణ
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘ఘర్షణ’ సినిమాలో మొదటగా నాగార్జున,వెంకటేష్ లను అడగగా నాగార్జున మల్టీ స్టారర్ సినిమాలో నటించటానికి సిద్ధంగా లేకపోవటంతో మణిరత్నం ప్రభు,కార్తీక్ తో తీసి సూపర్ హిట్ కొట్టాడు.

మౌన రాగం
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘మౌన రాగం’ సినిమాలో మొదటగా నాగార్జున,వెంకటేష్ లను అడగగా నాగార్జున మల్టీ స్టారర్ సినిమాలో నటించటానికి సిద్ధంగా లేకపోవటంతో మణిరత్నం మోహన్,కార్తీక్ లతో తీసి హిట్ కొట్టాడు.

దళపతి
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన దళపతి సినిమాలో నాగార్జునకు అఫర్ ఇస్తే తిరస్కరించాడు. అప్పుడు ఆ పాత్రను అరవింద్ స్వామి చేసాడు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.

మెకానిక్ అల్లుడు
అక్కినేని నాగేశ్వరరావు,చిరంజీవి కాంబినేషన్ లో గోపాల్ దర్శకత్వంలో వచ్చిన మెకానిక్ అల్లుడు సినిమాలో చిరంజీవి పాత్రకు మొదట నాగార్జునను అడిగారు. నాగార్జున రిజెక్ట్ చేయటంతో ఆ అవకాశం చిరంజీవికి వచ్చింది.

కలిసివుందాం రా
ఉదయ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘కలిసివుందాం రా’ సినిమాలో మొదట నాగార్జున అనుకున్నారు. నాగార్జున రిజెక్ట్ చేయటంతో వెంకటేష్ చేసాడు. ఈ కుటుంబ కథ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో మనకు తెలిసిన విషయమే.

బద్రి
బద్రి సినిమాని నాగార్జున డేట్స్ లేని కారణంగా రిజెక్ట్ చేసాడు. ఆ సినిమాని పవన్ కళ్యాణ్ చేసి ఎంతటి హిట్ ని అందుకున్నాడో తెలిసిన విషయమే కదా.

ఆహ
నాగార్జున అలా మిస్ అయిన సినిమా ఆహా. జగపతిబాబు హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ లోనే ఈ సినిమాను నిర్మించాడు నాగార్జున. సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నిరాశ పరిచింది.

రామాయణం
పది సంవత్సరాల క్రితం నాగార్జునతో రామాయణం అనే సినిమా చేయాలనుకున్నాడు వర్మ. కానీ దీనికి నిర్ధాక్ష్యణ్యంగా నో చెప్పాడు నాగార్జున.