Beauty Tips

Sandalwood benefits for skin:గంధంలో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా?

Sandalwood benefits for skin:పూజలలో, శుభకార్యాలలో గంధం ఎక్కువగా ఉపయోగిస్తారు. చందనం భోగ ప్రదమూ, శుభప్రదమూ, ఆరోగ్య ప్రదమూ, ఆహ్లాదకరమూ, అధ్యాత్మికమూ కూడా. ఎవరినైనా గౌరవించటానికి గంధం రాయటం మన సంప్రదాయంలో అంతర్భాగం.

గంధం దుర్గంధాన్ని పోగొడుతుంది. రక్త దోషాన్ని, పైత్యాన్ని తగ్గిస్తుంది. ఇది విషాన్ని హరిస్తుంది. క్రిమిహరం కూడా. వేసవికాలంలో గంధాన్ని అరగదీసి కళ్ళమీద రాసు కుంటే కళ్ళ ఎరుపులు మంట తగ్గుతాయి. చల్లదనాన్ని కలిగిస్తుంది.

స్నానం చేసే నీళ్ళలో గంధం నూనె అయిదారు చుక్కలు వేసుకుని స్నానం చేస్తే చర్మవ్యాధులు రావు. శరీరం తాజాగా ఉంటుంది. అంతే కాదు చందనం అంతస్తాపాన్ని కూడా హరిస్తుంది. ఆ కారణంగానే చందనాన్ని ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగిస్తారు.

చందనంతో తయారైన సోపులు, పౌడర్లు వాడితే చర్మానికి మంచిది. వేడిచేసి పిల్లలకు కురుపులుగా వస్తే గంధం అరగ దీసి రాస్తే కురుపులు తగ్గిపోతాయి.మంచి గంధం అరగదీసి రోజూ రెండుసార్లు ముఖానికి రాసుకుంటే మొటిమలు పోతాయి.

చందనాది తైలం వల్ల తలనొప్పి, కళ్ళ మంటలు తగ్గుతాయి. గాయాలకు చందనం పూస్తే త్వరగా మానిపోతాయి. వేసవిలో చర్మం పేలితే, చర్మం మీద పొంగువస్తే చందనం రాస్తే పోతుంది. గంధం యాంటీసెప్టిక్‌లా పనిచేస్తుంది. నూనె ఆలివ్‌ ఆయిల్‌లో కలిపిన గంధాన్ని శరీరానికి మసాజ్‌ చేస్తే చర్మం మృదువుగా ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.