Kitchenvantalu

Clay Cookware:వంట చేసే మట్టి పాత్రల్ని ఇలా సింపుల్ గా క్లీన్ చేయొచ్చు

Clay Cookware:ఈ మధ్యకాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ద పెరిగి మట్టి పాత్రలలో వండుతున్నారు. మట్టి పాత్రల్లో వండటం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వాటి వాడకం చాలా ఎక్కువైంది. సాంబార్ నుంచి చేపల కూర వరకు మట్టి పాత్రలోనే వండుతున్నారు. మట్టి పాత్రలో వంటలు వండితే రుచి చాలా బాగుంటుంది.

మట్టి పాత్రలను రెగ్యులర్ గా వాడితే వాటిలో నూనె మరకలు మరియు వంట చేసినప్పుడు కొన్ని పదార్థాలు మిగిలిపోయి మరకలుగా ఉంటాయి. వీటిని క్లీన్ చేయడానికి ఈ రోజు కొన్ని చిట్కాలను తెలుసుకుందాం. మట్టి పాత్రని క్లీన్ చేసేటప్పుడు సబ్బు వాడకూడదు. సబ్బు వాడటం వలన జిడ్డు వదలదు. అలాగే ఆ వాసన పాత్రకే ఉండిపోతుంది. అందువల్ల మట్టి పాత్రని శుభ్రం చేయటానికి మెత్తగా ఉన్న స్క్రబ్బర్ వాడితే మంచిది.

మట్టి పాత్రలను శుభ్రం చేయటానికి ముందు దానిలో కొద్దిగా నీరు పోసి సోడా పౌడర్,నిమ్మ ముక్కలు వేసి పొయ్యి మీద పెట్టి మరిగించాలి. బాగా మరిగిన తర్వాత నీటిని వంపేసి కొంచెం శనగపిండి వేసి స్క్రబ్బర్ తో క్లీన్ చేయాలి. మట్టి పాత్రలో వంటలను చేసుకుంటే మెగ్నీషియం, కాల్షియం, ఇనుము, సల్ఫర్ మన శరీరానికి అందుతాయి. మనం తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణం అవుతుంది. వండిన ఆహారం చాలా రుచిగా ఉంటుంది. ఆహార పదార్థాలు కూడా పాడవకుండా ఎక్కువ సమయం ఉంటాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.