Healthhealth tips in telugu

Stomach ulcer:అల్సర్ నుండి బయటపడాలంటే ఇలా ట్రై చేయండి

Stomach ulcer:సమయానికి ఆహారం తినకపోవడం, కారం అధికంగా ఉన్న వంటకాలు తినడం వలన అల్సర్‌కు దారితీయవచ్చు. అందుచేత అల్సర్‌ను దూరం చేసుకోవాలంటే కొబ్బరిబోండాంను తీసుకోవాల్సిందే. కొబ్బరినీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

కొబ్బరిబోండాంలోని నీటిని ఉదయం సాయంత్రం తీసుకుంటే అల్సర్ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది శరీర ఉష్ణాన్ని కూడా తగ్గిస్తుంది.కంటికి మేలు చేస్తుంది. జీర్ణ సంబంధిత రుగ్మతలను నయం చేస్తుంది.

కడుపులో మంట, ఛాతిలో మంట, వేవిళ్ళు వంటి లక్షణాలు తెలియవస్తే, చాక్లెట్, కూల్ డ్రింక్స్, మద్యపానం, పెప్పర్‌మింట్, కాఫీ, బ్లాక్ టీ, ఆరెంజ్, ద్రాక్ష, వెల్లుల్లి, మిరప, పాల ఉత్పత్తులు, కారపు పదార్థాలు తీసుకోకపోవడం మంచిది.

ఇక మధ్యాహ్నం పూట కొబ్బరిబోండాం నీటిని తీసుకుంటే రక్తాన్ని శుద్ధి చేస్తుంది.రక్తహీనతకు చెక్ పెడుతుంది. బీపీని కంట్రోల్ చేస్తుంది. పచ్చకామెర్లు, కలరా, చికెన్ ఫాక్స్‌ను దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

గోధుమలు, చికెన్, ఫిష్, బీన్స్, కోడిగుడ్డు, పెరుగు, మేడిపండును తీసుకోవచ్చు. కానీ చక్కెర, కొవ్వు అధికంగా గల ఆహారాన్ని పూర్తిగా తీసుకోవడం మానేయాలి. ఉప్పును కూడా తగ్గించాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.