Healthhealth tips in telugu

Health Tips:ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఆరోగ్య చిట్కాలు

ఆరెంజ్

ఒక పెద్ద ఆరెంజ్ లో 74 మిల్లీ గ్రాముల క్యాల్షియం ఉంటుంది. ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి కూడా సమృద్ధిగా ఉంటుంది. అంతేకాకుండా కేలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి.

బాదాం పప్పు

బాదాం పప్పులో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. 30 గ్రాముల బాదాం పప్పులో 75 మిల్లీ గ్రాముల క్యాల్షియం ఉంటుంది. అయితే వీటిని పొట్టు తీయకుండా తింటేనే మంచిది. బాదాం పప్పులో విటమిన్ E,పొటాషియం కూడా ఉంటాయి. మితంగా తింటే చెడు కొలస్ట్రాల్ తగ్గటానికి సహాయపడుతుంది.

కివి ఫ్రూట్ తో నిద్రలేమి దూరం

నిద్రలేమితో బాధపడుతున్న వారికి కివి ఫ్రూట్ మించిన ఔషధం మరొకటి లేదు. దీనిలో ఉండే సెరోటొనిన్ నిద్రలేమిని పోగొడుతుంది. మీరు పడుకోవడానికి గంట ముందు రెండు కివీ పళ్లు తింటే హాయిగా నిద్రపోవడానికి ఇది ఎంతాగనో తోడ్పడుతుంది.

రక్తహీనతకు చెక్ పెట్టాలంటే

బీట్ రూట్ లో ఫోలిక్ యాసిడ్, ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది అనీమియా పేషంట్స్ కు చాలా మేలు చేస్తుంది. రక్తహీనతకు బీట్‌రూట్ మంచిది. ఇందులోని పోషకాలు ఎర్రరక్త కణాలను వృద్ధి చేసి శరీరంలో రక్త శాతాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయి.

బ్లూ బెర్రీ ఆరోగ్య ప్రయోజనాలు

బ్లూ బెర్రీల‌ను త‌ర‌చూ తిన‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు త‌గ్గుతుంది. డిప్రెష‌న్ బారిన ప‌డే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి. బ్లూబెర్రీల‌లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువే. ఇవి శ‌రీర క‌ణ‌జాలాన్ని నాశ‌నం కాకుండా ర‌క్షిస్తాయి. ఫ్రీ ర్యాడిక‌ల్స్ బారిన ప‌డ‌కుండా చూసుకుంటాయి. క్యాన్స‌ర్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి.