Kitchenvantalu

Spicy tomato and bean rice:టమోటా బీన్స్ పలావ్ ఎలా తయారుచేయాలో తెలుసా?

కావలసినవి
తెల్ల బీన్స్‌ (సూపర్‌ మార్కెట్స్‌లో లభ్యమవుతాయి) 150 గ్రా., బాస్మతి బియ్యం 2 కప్పులు, టొమాటొ రసం 3 కప్పులు, పలావు ఆకు ఒకటి, లవంగాలు 2, దాల్చిన చెక్క చిన్న ముక్క, యాలకులు 2, నెయ్యి 3 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు తగినంత.

తయారి విధానం
పలావ్ ఉదయం చేసుకోవాలంటే ముందు రోజు రాత్రి బీన్స్ ని నానబెట్టాలి. ఉదయం నానిన బీన్స్ లో నీటిని తీసేయాలి. బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీటిలో 15 నిమిషాల పాటు నానబెట్టి నీటిని తీసేయాలి. ఒక బాణలిలో నెయ్యి వేసి వేడి చేయాలి.

నూనె వేడెక్కాక మసాలా దినుసులన్నిటినీ వేసి బాగా వేగించాలి. తర్వాత బాసుమతి బియ్యం వేసి మూడు నిమిషాలు వేగించాలి. ఆ తర్వాత బీన్స్‌ కూడా వేసిన తర్వాత టొమాటొ రసం, ఉప్పు వేసి బాగా కలపాలి. మంట తగ్గించి మూత పెట్టాలి. టొమాటొ రసం ఇగిరి, బియ్యం ఉడికే వరకు ఉంచాలి. దీనిని వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."