Beauty Tips

Dandruff:సులభంగా ఇంటిలో దొరికే వస్తువులతో చుండ్రు నివారణకు పరిష్కారాలు

Dandruff:శనగపిండి:
ఒక కప్పు పెరుగులో నాలుగు స్పూన్ల శనగపిండి కలపాలి. ఈ మిశ్రమాన్ని గడ్డలు లేకుండా కలపి మెత్తని పేస్ట్‌ గా చేయాలి. ఆ తర్వాత ఈ పేస్ట్ ను వెంట్రుకల మొదళ్లనుంచి చివళ్ల దాకా బాగా పట్టించాలి. అరగంటసేపు ఆరనిచ్చి తలస్నానం చేయాలి. ఇలా కొన్ని వారాల పాటు చేసినట్లయితే చుండ్రు ఏ మందులూ లేకుండానే క్రమంగా తగ్గిపోతుంది.

మెంతులు, పెరుగు పేస్ట్‌
మెంతులను ముందురోజు రాత్రి పెరుగులో నానబెట్టి ఉదయం మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ గా చేసుకుని వెంట్రుకలకు బాగా పట్టించాలి. మెంతులు చుండ్రు నివారణలో చాలా బాగా పని చేస్తాయి.

గోరింటాకు
గోరింటాకును కోసిన వెంటనే రసం తీసి తలకు పట్టించినట్లయితే చుండ్రు నివారణ అవుతుంది.అందులో ఆమ్ల (పెద్ద ఉసిరి) పొడిని కూడా కలిపితే మరింత మంచి ఫలితం వస్తుంది.

వెనిగర్‌
వెనిగర్ ను ఆరు స్పూన్స్ తీసుకోని రెండు స్పూన్ల నీటిని కలిపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత స్నానం చేయాలి.ఇలా వారానికి ఒకసారి చేసినట్లయితే కేవలం నాలుగు నెలల్లో మీ చుండ్రు సమస్య నివారణ అవుతుంది.

ఉసిరికపొడి
ఉసిరిక పొడిని అన్ని ఆయుర్వేద షాపుల్లో అమ్ముతారు. ఉసిరిక పొడిని తీసుకోని దానిలో నిమ్మరసం కలిపి మెత్తని పేస్ట్‌లా చేసుకుని తల కుదుళ్లకు పట్టించాలి. ఆ తర్వాత తల మసాజ్ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేసినట్లయితే తొందరగా తలలో ఉండే చుండ్రు నివారణ అవుతుంది.