MoviesTollywood news in telugu

Tollywood:టాలీవుడ్ సెలబ్రేటిస్ లో ఎంత మంది డాక్టర్స్ ఉన్నారో తెలుసా ?

Tollywood:డాక్టర్ అవ్వాలనుకుని యాక్టర్ అయ్యానని చెప్పడం వింటుంటాం. కానీ డాక్టర్ చదివి కూడా యాక్టర్ అయినవాళ్లు ఉన్నారు. ఒకప్పుడు హాస్య నటుడిగా ,క్యారెక్టర్ యాక్టర్ గా, హాస్యంతో కూడిన విలన్ గా రాణించిన డాక్టర్ అల్లు రామలింగయ్య డాక్టర్.

ఆయన హోమియోపతి వైద్యం చేసేవారు. ఇక ఆయన పేరిట రాజమండ్రిలో డాక్టర్ అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియోపతి కాలేజీ కూడా ఉంది. ఈయన అల్లుడే మెగాస్టార్ చిరంజీవి. కొడుకు అల్లు అరవింద్ మెగా ప్రొడ్యూసర్. మనవడు బన్నీ స్టార్ హీరో.

తరవాత జనరేషన్ లో డాక్టర్ రాజశేఖర్ ఎంబి బిఎస్ పూర్తిచేసి, కొంతకాలం హౌస్ సర్జన్ గా చేసాడు. సినిమాల్లో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ఎన్నో చిత్రాలతో దూసుకెళ్లి ఆతర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే చిత్రాలతోనూ రాణించారు.

ఇప్పటి జనరేషన్ లో ఇక ఎన్నో సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మలయాళీ ముద్దుగుమ్మ ఫిదా హీరోయిన్ సాయిపల్లవి స్టడీ పరంగా ఎం బి బి ఎస్ పూర్తిచేసింది. సాయిపల్లవి కార్డియాలజిస్ట్ చేసింది. షోలతో అదరగొడుతూ ఎంబి బిఎస్ పూర్తిచేసిన ఈ అమ్మడు సినిమాల్లో బిజీగా ఉంది.

ఇక రంగం మూవీతో పరిచయమైన అజ్మర్ కూడా ఉక్రెయిన్ లో మెడిసిన్ పూర్తిచేసాడు. ఎన్నో సపోర్టింగ్ పాత్రల్లో నటించిన భరత్ రెడ్డి కూడా ఆమెరికాలో కార్డియాలజీలో డిప్లొమా చేసాడు. అపోలో హాస్పిటల్ లో సేవలు అందిస్తున్నాడు.

అంతేకాదు, నటుడు ప్రభాకర్ కూడా డాక్టర్. సినిమాల్లో డాక్టర్ పాత్రలు ఎక్కువ వేస్తుంటాడు. అలాగే ఉమామహేశ్వర ఉగ్ర రూప సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన జ్యోతిక గా యాక్ట్ చేసిన తెలుగమ్మాయి రూప కూడా డాక్టర్ చదివింది. ఈమె గుంటూరు మెడికల్ కాలేజీలో చదివింది. తన యాంబిషన్ కూడా చెప్పింది.