Healthhealth tips in telugu

High Blood Pressure:హైబీపీని తగ్గించే సహజసిద్ధమైన పదార్థాలు..!

High Blood Pressure:హైబీపీ.. నేడు ప్రపంచంలో అత్యధిక మందిని ఇబ్బందులకు గురి చేస్తుంది.. ఒత్తిడి, ఆందోళన, గుండె జబ్బులు, మద్యం విపరీతంగా తాగడం.. తదితర అనేక కారణాల వల్ల చాలా మందికి హైబీపీ వస్తుంటుంది. అయితే కింద తెలిపిన సహజ సిద్ధమైన పదార్థాలను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా హైబీపీ సమస్య నుంచి బయట పడవచ్చు. మరి ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

దాల్చినచెక్కలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. దీన్ని నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే హైబీపీ తగ్గుతుంది. తేనె, దాల్చినచెక్క పొడిని నిత్యం ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుంటే హైబీపీతోపాటు పీసీవోడీ, డయాబెటిస్ సమస్యల నుంచి బయట పడవచ్చు. అలాగే అధిక బరువు కూడా తగ్గుతారు.

అవిసె గింజెల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి హైబీపీని కంట్రోల్ చేస్తాయి. అలాగే ఈ గింజల వల్ల ఇతర అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవిసెగింజలను అలాగే తినవచ్చు. లేదా పొడి చేసుకుని మజ్జిగ, ఫ్రూట్ సలాడ్ వంటి వాటిలో కలుపుకుని కూడా తినవచ్చు.

వెల్లుల్లి హైబీపీని తగ్గించడంలో అమోఘంగా పనిచేస్తుంది. నిత్యం ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలను పచ్చిగా తినడం వల్ల హైబీపీ, కొలెస్ట్రాల్ తగ్గుతాయి. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.

యాలకులను నిత్యం ఆహారంలో భాగం చేసుకోడం ద్వారా హైబీపీకి చెక్ పెట్టవచ్చు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. అలాగే వీటిలో ఉండే ఫైబర్ మన శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.