Healthhealth tips in telugu

Nuts:ఈ నట్స్ ఎప్పుడైనా తిన్నారా…జీడిపప్పు,బాదం పప్పు కంటే సూపర్ పప్పు

Brazil Nuts Health benefits In telugu : ఈ మధ్య కాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగి ఎన్నో పోషకాలు ఉన్న డ్రై ఫ్రూట్స్ ని తినటం అలవాటుగా చేసుకున్నారు. బ్రెజిల్ నట్స్ తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అయితే మనలో చాలా మందికి బ్రెజిల్ నట్స్ గురించి తెలియదు. వీటిలో బాదంపప్పు., జీడిపప్పు కన్నా ఎక్కువ పాషకాలు, ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
brazil nuts
ఈ నట్స్ లో సెలీనియం పోషకం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నట్స్ ఒకప్పుడు మనకు చాలా అరుదుగా లభించేవి. కానీ ఇప్పుడు ఆన్లైన్ స్టోర్స్ లోను, డ్రై ఫ్రూట్ షాప్ లోను విరివిగానే లభ్యమవుతున్నాయి. వీటిలో ఉండే సెలీనియం అనే పోషకం మన శరీరంలోనికి విష పదార్థాలు., వ్యర్ధాలు రాకుండా కాపాడుతుంది.

ఈ నట్స్ లో ఉండే ఒమేగా-3 ఫ్యాట్టీ యాసిడ్స్‌, విటమిన్ E,మెగ్నీషియం అనేవి చెడు కొలెస్ట్రాల్ తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. బ్రెజిల్ నట్స్ లో ఉండే ఎల్లాజిక్ యాసిడ్ శరీరంలోని వేడి, మంటలు, నొప్పులు, వాపులను తగ్గించడానికి సహాయపడుతుంది.

టెన్షన్, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు ఉన్నప్పుడు నాలుగు బ్రెజిల్ నట్స్ తింటే మెదడులో సెరొటోనిన్ చక్కగా పనిచేసే మెదడు చురుగ్గా ఉండి టెన్షన్, తలనొప్పి వంటివి అన్నీ తొలగిపోతాయి. అలాగే నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి కూడా మంచి నిద్ర పట్టేలా చేస్తుంది. థైరాయిడ్ గ్రంధి పని తీరుకు ఈ నట్స్ చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి.
Weight Loss tips in telugu
ఈ నట్స్ లో ప్రోటీన్లు, ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేసి తొందరగా ఆకలి లేకుండా చేసి బరువు తగ్గటంలో సహాయపడుతుంది. వీటి ధర కాస్త ఎక్కువగా ఉన్నా సరే దానికి తగ్గట్టుగానే మన శరీరానికి ప్రయోజనాలు అందుతాయి. సాధ్యమైనంత వరకు ఈ నట్స్ తినటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.