Healthhealth tips in telugu

Betel Leaf Health Benefits:తమలపాకు నమిలితే కలిగే ప్రయోజనాలివే.. ఆ తప్పు మాత్రం చేయొద్దు!

Betel Leaf Health Benefits : తమలపాకును దేవుని ఆరాధనలో ఎక్కువగా ఉపయోగిస్తాం. తమలపాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మనలో చాలా మందికి తమలపాకు తినే అలవాటు ఉంటుంది. కానీ కొంతమంది తినటానికి ఆసక్తి చూపరు. తమలపాకు బరువు తగ్గించటానికి సహాయపడుతుంది.

తమలపాకులో యూజీనాల్ అనే ప్రత్యేక సమ్మేళనం ఉంటుంది. సాదరణంగా మనం తీసుకున్న ఆహారం జీర్ణం అయ్యిన తర్వాత పిండి పదార్ధంగా మారుతుంది. కొన్ని కొవ్వులు కాలేయానికి కూడా పంపబడతాయి. కాలేయం అదనపు కార్బోహైడ్రేట్‌ను కొవ్వుగా మారుస్తుంది. కార్బోహైడ్రేట్లు ఎంత ఎక్కువ కొవ్వుగా మారితే అంత బరువు పెరుగుతారు.

కొవ్వులు మరియు ప్రోటీన్ల కంటే అదనపు కార్బోహైడ్రేట్లను తినడం వల్ల బరువు పెరుగుట ఎక్కువగా అవుతుంది. కాలేయంలో కార్బోహైడ్రేట్లు కొవ్వుగా మార్చబడతాయి. యూజీనాల్ కాలేయంలో కార్బోహైడ్రేట్లను కొవ్వుగా మార్చడాన్ని నిరోధిస్తుంది. కార్బోహైడ్రేట్లను కొవ్వుగా మార్చడానికి కొన్ని ఎంజైమ్‌లు అవసరం అవుతాయి.

ఆ ఎంజైమ్స్ ని తమలపాకులోని యూజినాల్ నిరోధిస్తుంది. దాంతో శరీరంలో కొవ్వు నిల్వలు తగ్గి బరువు తగ్గటానికి అవకాశం కలుగుతుంది. తమలపాకులో టెర్పెనెస్ మరియు పాలీఫెనాల్స్ అనే రెండు సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మైటోకాండ్రియాను సక్రియం చేసి శక్తి ఉత్పత్తిని పెంచుతాయి.

పెరిగిన శక్తి ఉత్పత్తి జీవక్రియను పెంచుతుంది. దాంతో బరువు తగ్గుతారు. అలాగే తమలపాకులోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు మరియు కొన్ని ప్రత్యేక సమ్మేళనాలు చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ప్రతి రోజు చిన్న తమలపాకు ఆకును తినవచ్చు. లేదా తమలపాకును రసం తీసుకొని ఏదైనా జ్యూస్ లో ఒక స్పూన్ కలుపుకొని తాగవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.