Healthhealth tips in telugu

piles Home Remedies:పైల్స్ సమస్య ఉన్నవారు ఇలా చేస్తే చాలు…శాశ్వతంగా మాయం అవుతాయి

piles Home Remedies In telugu : ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చాలా మంది పైల్స్ సమస్యతో బాధపడుతున్నారు. మారిన ఆహారపు అలవాట్లు,నీరు తక్కువగా తాగటం,మలబద్దకం సమస్య,ఒత్తిడి వంటి కారణాలతో పైల్స్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. పైల్స్ సమస్య ఉన్నప్పుడు బాధ విపరీతంగా ఉంటుంది.
piles home remedies
ఈ సమస్యను ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. డాక్టర్ సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే చాలా తొందరగా పైల్స్ సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. కాస్త ఓపిక,సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. ఈ సమస్య పరిష్కారానికి వాము ఎంతగానో సహాయపడుతుంది.

వాము ను తీసుకొని మిక్సీలో వేసి మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. ఒక గ్లాసు పలుచని మజ్జిగ తీసుకొని దానిలో పావు స్పూన్ నల్ల ఉప్పు, పావు స్పూన్ వాముపొడి వేసి బాగా కలపాలి. ఈ మజ్జిగను ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తాగుతూ ఉండాలి. ఫైల్స్ సమస్య తగ్గే వరకు ఈ విధంగా తాగుతూ ఉండాలి.
weight loss tips in telugu
మసాలాలు, కారాలు చాలా తక్కువగా తీసుకోవాలి. అధిక ఫైబర్ ఉండే ఆహారాలను తీసుకోవటానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అలా చేస్తూ ఇప్పుడు చెప్పే జాగ్రత్తలు పాటించాలి. గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం తగ్గించాలి. మూడు గంటల వ్యవధిలో కనీసం రెండుసార్లు లేచి ఓ 5 నిమిషాల పాటు అటుఇటు తిరగడం మంచిది.
Black salt Face Benefits
నీరు ఎక్కువగా తాగితే శరీరంలో వేడి తగ్గి ఫైల్స్ బారిన పడకుండా ఉంటాం. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడూ అసలు అశ్రద్ద చేయకుండా డాక్టర్ ని సంప్రదించాలి. డాక్టర్ ఇచ్చిన సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పిన్ చిట్కాలను పాటిస్తే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. కాబట్టి పైల్స్ సమస్య ఉన్నవారు ఈ చిట్కాను ఫాలో అవ్వండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.