Beauty Tips

Hair Growth:జుట్టుకి నూనె రాసేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా ?

Hair Growth tips:ఈ మధ్య కాలంలో జుట్టు రాలే సమస్య చాలా ఎక్కువ అవుతుంది. జుట్టుకి సరైన పోషణ లేకపోవటం వలన ఈ సమస్య వస్తుంది. అలాగే జుట్టుకి నూనె రాసె విధానం వలన కూడా ఈ సమస్య వస్తుంది. అసలు జుట్టుకి నూనె ఎలా రాయాలి. ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి వంటి విషయాలను తెలుసుకుందాం.

జుట్టుకి నూనె రాసేటప్పుడు వెంట్రుకలను, తలపై చర్మాన్ని మృదువుగా వలయాకారంలో నిమిరుతున్నట్టుగా రుద్దాలి. ఇలా నూనెతో మర్దన చేయడం వల్ల వెంట్రుకలకు బలం చేకూరి బాగా పెరిగే అవకాశం ఉంది.

తలస్నానము చేసినప్పుడు జుట్టు ఆరకుండా నూనె రాయకూడదు.

జుట్టు కుదుళ్ళు చాలా సున్నితంగా ఉంటాయి . తడిగా ఉన్నప్పుడు నూనె రాస్తే ఒత్తిడికి గురి అయ్యి వెంట్రుకలు రాలిపోతాయి.

నూనె రాయటం అంటే జుట్టు కుదుళ్లకు రాయటం కాదు. జుట్టు మొదళ్ళు నుంచి చివర్ల వరకు రాయాలి. కామన్ గా అందరూ కుదుళ్లకు రాసి చివర్లకు రాయటం మానేస్తారు. ఇది చాలా పెద్దతప్పు .

కొబ్బరి నూనె పోషణకు మంచిది. బాదం నూనె వెంట్రుకల పెరుగుదలకు దోహదపడుతుంది.