Healthhealth tips in telugu

Watermelon seeds:1 స్పూన్ గింజలను నానబెట్టి తింటే జీవితంలో డాక్టర్ అవసరం ఉండదు…ఇది నిజం

Watermelon seeds Benefits : పుచ్చకాయ అంటే ఒకప్పుడు వేసవికాలంలో మాత్రమే లభ్యం అయ్యేది. అయితే ఇప్పుడు అన్ని కాలాల్లోనూ లభ్యం అవుతున్నాయి. అయితే వేసవికాలంలో లభ్యం అయ్యే పుచ్చకాయలు చాలా రుచిగా ఉంటాయి. మనం సాధారణంగా పుచ్చకాయ ముక్కలను తిని గింజలను పాడేస్తూ ఉంటాం. మనం పాడేసే గింజలలో ఎన్ని పోషక విలువలు మరియు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

వాటి గురించి తెలుసుకుంటే పుచ్చకాయ గింజలను పాడేయరు. ఇప్పుడు పుచ్చగింజలలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరంగా తెలుసు కుందాం. పుచ్చకాయ గింజలలో కేలరీలు తక్కువ పోషకాలు అధికంగా ఉంటాయి. పుచ్చకాయ గింజలలో పొటాషియం, రాగి, సెలీనియం మరియు జింక్ వంటి అనేక సూక్ష్మపోషకాలు పుష్కలంగా ఉంటాయి.

ఈ సూక్ష్మ పోషకాలను మనం తీసుకొనే ఆహారం ద్వారా తగినంత పరిమాణంలో పొందలేము. ఈ గింజలు గుండె ఆరోగ్యం మరియు రోగనిరోధక శక్తిని పెంచడం మరియు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడం వంటి ఎన్నో ప్రయాజనాలను అందిస్తుంది. ఈ గింజలలో ప్రోటీన్ మరియు విటమిన్ బి,ఖనిజాలు, విటమిన్లు,మెగ్నీషియం, మోనోశాచురేటెడ్ మరియు పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు మరియు లినోలెయిక్ ఆమ్లం సమృద్ధిగా ఉంటుంది.

వీటిని గింజల రూపంలో గాని పొడి రూపంలో గాని తీసుకోవచ్చు. పుచ్చకాయ విత్తనాలలో ఉండే మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తుంది. ఇది సాధారణ గుండె పనితీరుకు సహాయపడుతుంది మరియు రక్తపోటును నియంత్రిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతకు మరియు రక్త ప్రసరణ బాగా జరగటానికి మెగ్నీషియం సహాయాపడుతుంది.

పుచ్చకాయ విత్తనాలలో జింక్ కూడా పుష్కలంగా ఉంటుంది, ఇది గుండె ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది గుండె కణాలలో కాల్షియం కదిలే విధానాన్ని నియంత్రిస్తుంది. అధిక కాల్షియం స్థాయిలు గుండె ఆగిపోవడానికి కారణం అవుతుంది. అందువల్ల గుండె ఆరోగ్యానికి జింక్ చాలా అవసరం. పుచ్చకాయ గింజలలో ఐరన్ మరియు విటమిన్ బి ఉండుట వలన రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండేలా చేస్తుంది.
Diabetes diet in telugu
పుచ్చకాయ గింజలను యాంటీ డయాబెటిక్ గా పరిగణిస్తారు. ప్లాస్మా గ్లూకోజ్ స్థాయిలను తగ్గించే సామర్థ్యాన్నికలిగి ఉంటాయి. పుచ్చకాయ విత్తనాలలో ఉండే ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు టైప్ 2 డయాబెటిస్ ను నివారించడంలో సహాయపడతాయి. మధుమేహం ఉన్నవారిలో రక్తపోటు సమస్యను కూడా తగ్గిస్తుంది. పుచ్చకాయ విత్తనాలలో ఉన్న మెగ్నీషియం జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
Brain Foods
ఇది వృద్ధాప్యంతో సంబంధం ఉన్న మెమరీ లోపాలతో కూడా పోరాటం చేస్తుంది. న్యూరోప్రొటెక్టివ్ ప్రభావాలను కలిగి ఉండటం వలన అల్జీమర్స్ వ్యాధి ఉన్న రోగులలో జ్ఞాపకశక్తిని పెంచటంలో సహాయం చేస్తుంది. పుచ్చకాయ విత్తనాలలో ఉన్న మెగ్నీషియం శరీరంలోని పోషకాలను గ్రహించడంలో సహాయపడే ఎంజైమ్‌లను సక్రియం చేస్తుంది. ఇది ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి మరియు మంచిగా జీర్ణించుకోవడానికి వీలు కల్పిస్తుంది.
gas troble home remedies
ఇది జీర్ణక్రియ సమయంలో శక్తిని ఉత్పత్తి చేయడానికి మరియు రవాణా చేయడానికి సహాయపడుతుంది. పుచ్చకాయ విత్తనాలలో ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా జుట్టు,చర్మ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పుచ్చకాయ గింజలలో జింక్, మెగ్నీషియం సమృద్ధిగా ఉండుట వలన జుట్టు రాలకుండా ఆరోగ్యంగా, బలంగా, ఒత్తుగా, ప్రకాశవంతంగా ఉండేలా చేస్తాయి. చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ బారి నుండి కాపాడుతుంది. అలాగే ముడతలు,మొటిమలు మరియు ఇతర చర్మ సమస్యలను తగ్గిస్తుంది.
Wrinkles remove Tips In Telugu
ముఖ్యంగా వృద్దాప్య ప్రక్రియను నిదానం చేస్తుంది. ఇప్పటి వరకు పుచ్చకాయ గింజలలో ఉన్న ప్రయోజనాల గురించి తెలుసుకున్నాం. పుచ్చకాయ గింజలతో టీ తయారుచేసుకొని త్రాగవచ్చు. పుచ్చకాయ గింజలను ఎండబెట్టి మొత్తగా పొడి చేసుకోవాలి. రెండు లీటర్ల నీటిలో రెండు టేబుల్ స్పూన్ల పుచ్చ గింజల పొడి వేసి పావుగంటసేపు మరిగించాలి. దీన్ని రెండు రోజులపాటు తాగొచ్చు. తర్వాత ఓ రోజు విరామం ఇచ్చి మళ్లీ రెండు రోజులు తాగాలి. ఈ విధంగా పుచ్చకాయ గింజల టీ త్రాగటం వలన ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.