Healthhealth tips in telugu

Onion:ఉల్లి చేసే మేలు గురించి తెలుసుకుంటే మానకుండా తింటారు

Onion Health benefits:ఈ రోజుల్లో చాలా మంది కీళ్ళ నొప్పులు, కొలస్ట్రాల్ సమస్యలతో బాధ పడుతున్నారు. వీటిని అదుపు చేయాలంటే ఆహారంలో ఉల్లిపాయను చేర్చుకోవాలి.

ఇది రక్తంలో గడ్డలను కరిగిస్తుంది. అలాగే గుండె నొప్పులకు కారణమయ్యే కొలస్ట్రాల్ సమస్యను అదుపులో ఉంచి ట్రైగిజరాయిడ్స్ పెరగకుండా చేస్తుంది. ఉల్లిపాయలో ఉండే ప్లవనాయిడ్స్ గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది. మోనోపాజ్ కి ముందు ఎముకలు సాంద్రత కోల్పోయి గుల్లబారతాయి.

అప్పుడు ఉల్లిపాయను తగిన మోతాదులో తీసుకుంటే ఈ సమస్య నుండి బయట పడవచ్చు. ఉల్లిలో ఉన్న కొన్ని పోషకాలు శరీరానికి వ్యాది నిరోదకత శక్తిని అందించి వివిధ రకాల వ్యాధులు రాకుండా కాపాడతాయి. ప్రతి రోజు ఒక మోస్తరు సైజ్ ఉల్లిపాయను తీసుకుంటే అండాశయ

క్యాన్సర్ ను అదుపు చేస్తుంది. బ్యాక్టీరియా సంబందిత ఇన్ఫెక్షన్ నివారించి,రక్తంలో చక్కెర స్థాయిలను సమంగా ఉండేలా చేస్తుంది. తద్వారా మధుమేహ వ్యాది అదుపులో ఉంటుంది. ఉల్లిపాయను నూనెలో ఎక్కువగా వేగించినప్పుడు కన్నా ఆవిరిలో ఉడికించి నప్పుడు అధిక ప్రయోజనాలు ఉంటాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.