Kitchenvantalu

Paneer Curry recipe:పక్కా ఢాబా స్టైల్ పనీర్ కర్రీ అన్నం,చపాతీ,రోటి లోకి Super గా తినేయచ్చు

Paneer Curry recipe:పక్కా ఢాబా స్టైల్ పనీర్ కర్రీ అన్నం,చపాతీ,రోటి లోకి Super గా తినేయచ్చు..
కావలసిన పదార్దాలు :
పాలు 2 లీటర్లు
పెరుగు 2 కప్పులు
పన్నీర్ గ్రేవీ కి కావలసినవి :
టొమాటోలు 1 /2 కిలో
ఉల్లిపాయలు 4
అల్లం 1 అంగుళం
పచ్చిమిర్చి 4
కారం 1 చెంచా
ధనియాలపొడి 2 చెంచాలు
ఉప్పు, పసుపు, నూనె సరిపడా

తయారి విదానం :
ఒక గిన్నెలో పాలను మరిగించి దాంట్లో పెరుగును వేసి సన్నని మంట మీద ఉంచాలి. పాలు విరిగిన తర్వాత దించి పలుచని గుడ్డలో పోసి మూటగట్టి వ్రేలాడదీసి నీరు పోయిన తర్వాత ఆ మూటను ఒక పళ్ళెంలో పెట్టి దాని మీద బరువైనది పెట్టి ఒక గంట తర్వాత తీసి కావలసిన ఆకారంలో ముక్కలు చేసుకుని ఉంచుకోవాలి.

బాండిలో రెండు గరిటల నూనె వేసి కాగిన తర్వాత అల్లం ముక్కలు వేపి ఆ తర్వాత ఉల్లిముక్కలు వేసి గోధుమ రంగు వచ్చే వరకు వేపి మసాలా పొడులను,కారం, ఉప్పు వేసి వేపి ఆ తర్వాత టొమాటో, మిర్చి ముక్కలు వేసి కొంచెం నీరు పోసి ఉడికించాలి. కొంచెం కర్రీ దగ్గరగా వచ్చిన తర్వాత పన్నీరు ముక్కలను వేసి 10 నిమిషాలు మరగనిచ్చి కొత్తిమీర చల్లి స్టవ్ మీద నుంచి దించి సర్వ్ చేయాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."