Healthhealth tips in telugu

Morning Sickness:ప్రెగ్నెన్సీ టైమ్‌లో వచ్చే వాంతులని తగ్గించే చిట్కాలు..

Morning Sickness:వికారం, వాంతుల అనుభూతి ఎదురైనప్పుడు తక్షణ ఉపశమనానికి కొన్ని గృహ చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం. కొందరికి తరచుగా వికారంగా అనిపిస్తుంటుంది. తీసుకునే ఆహార పదార్ధాలు, ఆరోగ్యం వంటివి దీనికి కారణాలుగా ఉంటాయి.

ఇది ఒక్కోసారి వాంతులు కాకపోయినా, అవుతున్న అనుభూతికి లోనుచేస్తూ మీ మానసిక స్థితిని కకావికలం చేస్తాయి. ఇటువంటప్పుడు, తరచుగా రెస్ట్ తీసుకోవాలని కోరుకుంటూ ఉంటారు. ఈ సందర్భంలో ఎవరైనా మిమ్మల్ని విసిగిస్తే, వారు ఖచ్చితంగా మీ కోపానికి గురికాక తప్పదు.

ప్రెగ్నెన్సీ టైమ్‌లో వాంతులు రావడం సర్వ సాధారణం. ఈ టైమ్‌లో ప్రయాణాలు చేయడం, యాసిడ్ రిఫ్లక్స్ కారణాల వికారం మరింత ఎక్కువ అవుతుంది. నలుగురిలో ఉన్నప్పుడు ఇలా జరిగితే, మీ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. తరచుగా త్రేన్పులు రావడం, నిలబడలేకపోవడం వంటివి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిని చక్కబెట్టడానికి, వికారం నుండి ఉపశమనానికి మీరు ప్రయత్నించగల 6 సాధారణ గృహ చిట్కాలను చూద్దాం..

అల్లం..
అల్లం, ప్రతి ఇంట్లో ఖచ్చితంగా లభించే ఉత్తమమైన పదార్ధం. వికారం, వాంతులు, కడుపు ఉబ్బరం, లేదా జీర్ణ సంబంధ వ్యాధుల చికిత్సకు సూచించదగిన ఉత్తమ నివారణగా ఈ అల్లం ఉంటుంది. ఒక చిన్న తాజా అల్లం ముక్కను నమలడం, లేదా వంటలో వాడడం, లేదా అల్లం టీ తీస్కోవడం వంటివి చేయవచ్చు. నిజానికి, అల్లం వినియోగం సురక్షితమే కానీ, ఏది కూడా అతిగా చేయకూడదని గుర్తుంచుకోండి.

నిమ్మకాయ..
వికారంగా ఉన్నప్పుడు, నిమ్మకాయలోని రిఫ్రెషింగ్ టేస్ట్ అద్భుతంగా పనిచేస్తుంది. నిమ్మరసంలో వికారాన్ని కలిగించే ఆమ్లాలను సరిచేయగల గుణాలు ఉంటాయి. ఇవి వికారం నుండి ఉపశమనాన్నిచ్చే బైకార్బోనేట్ సమ్మేళనాలను విడుదల చేస్తాయి. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో, నిమ్మరసం, చిటికెడు ఉప్పు వేసి కలిపి, తీసుకోవడం మంచిది. లేదా గ్రీన్ టీలో తేనె, నిమ్మరసాన్ని జోడించి తీసుకోవచ్చు.

పుదీనా ఆయిల్..
పిప్పరమింట్ ఎసెన్షియల్ ఆయిల్ సువాసన కూడా వికారం తగ్గించడానికి సహాయపడుతుంది. ఒక అధ్యయనం ప్రకారం, పిప్పరమింట్ అరోమా థెరపీ, అన్ని సందర్భాల్లోనూ వికారాన్ని 75 శాతం తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేసిందని తేలింది. మీరు మీ చేతి మీద కొన్ని చుక్కల పిప్పరమింట్ ఎసెన్షియల్ ఆయిల్ వేసి రుద్దుకుని, వాసన చూడవచ్చు. పిప్పరమింట్ నూనె వాసన సురక్షితం.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.