Beauty Tips

Carrot face pack:ముఖం మెరుస్తూ ఉండాలంటే క్యారెట్ పేస్ పాక్స్

Carrot face pack:మనం రెగ్యులర్ గా క్యారట్ తో కూరలు చేసుకుంటాం. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని మనలో చాలా మందికి తెలుసు. అయితే బ్యూటీ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ విషయం మనలో చాలా మందికి తెలియదు.

క్యారెట్‌లో బీటా కెరోటిన్లూ, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తితో పాటు చర్మానికి కాంతిని,మెరుపును ఇస్తాయి. క్యారట్ ని ముక్కలుగా కట్ చేసి మిక్సీ చేసి జ్యుస్ గా చేసుకోవాలి.

రెండు స్పూన్ల క్యారెట్ జ్యూస్ లో రెండు స్పూన్ల బొప్పాయి జ్యూస్, కొంచెం పాలు కలిపి ముఖానికి రాసి అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. క్యారెట్ యాంటీ ఏజింగ్ కారకంగా కూడా పనిచేస్తుంది.

రెండు టీ స్పూన్ల క్యారెట్ రసంలో, కొంచెం అరటి పండు గుజ్జు, గుడ్డులోని తెల్లసొన, నాలుగు చుక్కల నిమ్మరసం వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి.ఈ ప్యాక్ వారంలో మూడు సార్లు వేసుకుంటే ముడతలు అన్ని మాయం అవుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.