Beauty Tips

Stretch marks:స్ట్రెచ్ మార్క్స్ పోగొట్టే అద్భుతమైన ఇంటి చిట్కాలు

Stretch marks:స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఈ మధ్యకాలంలో మహిళలను చాలా ఇబ్బంది పెడుతుంది. అలాగే పొట్ట బాగా పెరిగినప్పుడు కూడా స్ట్రెచ్ మార్క్స్ వస్తూ ఉంటాయి. ఇవి ఎక్కువగా కడుపు, భుజాలు, కాళ్లపై వస్తూ ఉంటాయి.

వీటిని తగ్గించుకోవటానికి మార్కెట్లో దొరికే రకరకాల క్రీమ్స్ వాడుతూ ఉంటారు. అయితే ఫలితం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. అదే ఇంటి చిట్కాలు పాటిస్తే చాలా తొందరగా తగ్గిపోతుంది.

స్ట్రెచ్ మార్క్స్ తొలగించడానికి కలబంద చాలా అద్భుతంగా పనిచేస్తుంది. Stretch marks ప్రదేశంలో కలబంద ను రాసి పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఈ విధంగా వారం రోజుల పాటు చేస్తే మంచి ఫలితం కనబడుతుంది.

కొబ్బరి నూనె కూడా స్ట్రెచ్ మార్క్స్ తొలగించటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. స్ట్రెచ్ మార్క్స్ మీద కొబ్బరి నూనె రాసి రెండు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.

నిమ్మరసంలో విటమిన్ ఈ ఈ ఆయిల్ వేసి బాగా కలిపి స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రదేశంలో రాసి ఆరాక చల్లని నీటితో శుభ్రం చేయాలి.ఇప్పుడు చెప్పిన అన్ని చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ చిట్కాలు ఫాలో అవ్వండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.