Kitchenvantalu

Bottle Cleaning Tips: వాటర్ బాటిల్స్ ఎంత క్లీన్ చేసినా వాసన పోవడం లేదా.. ఇలా చేస్తే సరి..

Water Bottle Cleaning Tips:ఈ మధ్య కాలంలో వాటర్ బాటిల్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. వాటర్ బాటిల్స్ లో ఎన్నో రకాల మోడల్స్ వస్తున్నాయి. ప్లాస్టిక్ లో ఎన్ని మోడల్స్ ఉన్నా.. రాగి, స్టీల్స్ బాటిల్సే మంచిది.

ఇంటిలో అయినా.. బయటకు వెళ్ళినా.. ప్రతి ఒక్కరూ వాటర్ బాటిల్స్ వాడుతున్నారు. వీటిని ఎంత శుభ్రం చేసిన ఒక్కోసారి వాసన వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది.

బాటిల్స్ లోని వాసన తొలగించటానికి టీ, కాఫీ పౌడర్లు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. టీ డికాషన్ తయారుచేసి.. కాస్త చల్లారిన తర్వాత వాటర్ బాటిల్స్ లో వేసి బాగా షేక్ చేయాలి. ఇలా చేయడం వల్ల బాటిల్స్ లోని వాసన మొత్తం తొలగిపోతుంది. ఈ విధంగా రెండు రోజులకు ఒకసారి చేస్తే మంచిది.

నిమ్మకాయ కూడా చెడు వాసనను తొలగించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. వాటర్ బాటిల్ లో నీటిని పోసి అరచెక్క నిమ్మరసం వేసి షేక్ చేయాలి. ఇలా చేయడం వల్ల చెడు వాసన పోవడమే కాకుండా.. బ్యాక్టీరియా వంటివి ఏమైనా ఉన్నా పోతాయి.

బేకింగ్ పౌడర్ కూడా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. కొద్దిగా బేకింగ్ సోడాని తీసుకుని.. దాన్ని బాటిల్ లో వేసి.. వాటర్ ని పూర్తిగా నింపి ఒక రోజు వరకూ అలానే వదిలేసేయండి. ఆ తర్వాత రోజు క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వాసన పోవడమే కాకుండా.. తెల్లగా వస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.