Beauty Tips

Hair Fall:జుట్టు రాలుతుందా…. ఈ ఆహారాలు తప్పనిసరి

HAir Fall Foods:ఇటీవల కాలంలో మారిన జీవనశైలి పరిస్థితులు సరైన పోషకాహారం తీసుకోకపోవడం టెన్షన్ వంటి కారణాలతో జుట్టు రాలే సమస్య అధికమవుతుంది. కొన్ని ఆహారాలను డైట్ లో చేర్చుకుంటే జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు. జుట్టు రాలే సమస్య కోసం ఎటువంటి మందులు వాడాల్సిన అవసరం లేదు ఇంటి చిట్కాలతో సమర్థవంతంగా బయటపడవచ్చు.

గుడ్డు ప్రతిరోజు ఒకటి తీసుకోవాలి. గుడ్డులో ప్రొటీన్ మరియు పోషకాలు జుట్టు బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేయడమే కాకుండా జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది.

పాలకూరను కూడా వారంలో రెండుసార్లు తీసుకుంటూ ఉండాలి. పాలకూరలో ఉండే ఐరన్,ఫోలేట్ జుట్టు రాలకుండా సహాయపడతాయి.

మాంసాహారులైతే చేపలను కూడా వారంలో రెండు సార్లు తీసుకోవాలి. చేపలలో ప్రోటీన్స్ విటమిన్ ఎ ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టు రాలే సమస్యను తగ్గించే ఒత్తు గా ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి.

శాకాహారులైతే బాదం మెంతులు పాలు బత్తాయి నారింజ క్యారెట్ వంటి వాటిని తీసుకోవాలి. ఈ ఆహారాలను మీ డైట్ లో తీసుకుంటే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.