Devotional

Lizards in house:ఇంట్లో రెండు బల్లులు పోట్లాడుతూ కనిపిస్తే ఏమవుతుందో తెలుసా?

Lizards in house in telugu :బల్లి కనపడగానే కొందరు చీదరించుకుంటారు. మరికొందరు ఒళ్లు జలదరించినట్టు చేస్తారు. ఇంకొందరు దూరంగా పారిపోతారు. బల్లి ఎదురు పడడం, పైన పడడం వల్ల మనకు కొన్ని విషయాలు తెలుస్తాయని అంటారు. కొందరు దీన్ని బల్లి శాస్త్రమని కూడా పిలుస్తారు. అందులోని కొన్ని ముఖ్యమైన అంశాల వివరాల్లోకి వెళ్తే..

మన తల లేదా కుడి చేయిపై బల్లి పడితే, అది మన ఉద్యోగ వృద్ధిని తెలియజేస్తుంది. అంటే భవిష్యత్తులో మనం ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతామని అర్థం

మోకాళ్లపై బల్లి పడితే త్వరలో ఓ శుభవార్త వింటామని అర్ధమట.

బల్లులు రెండు పోట్లాడుతూ కనిపిస్తే మనం మన జీవితంలో అమితంగా ప్రేమించే వారితో విడిపోతామని అర్థం వస్తుందట.

ఇంట్లో బల్లి చనిపోయి కనిపిస్తే ఆ ఇంట్లోని వారికి అనారోగ్యం కలుగుతుందట.

పగటి పూట బల్లి అరుపు వినడం మంచిదేనట. దాంతో మనకు ఎలాంటి చెడూ కలగదట.

ఎవరైనా మహిళ పొట్టపై బల్లి పడితే వారికి త్వరలో గర్భం వస్తుందట.

పాదాలు లేదా కాలి వేళ్లపై బల్లి పడితే అది మనకు దురదృష్టాన్ని కలిగిస్తుందట.

ఏదైనా విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు బల్లులు విచిత్రంగా ప్రవర్తిస్తూ మనకు కనిపిస్తాయట.

ఏదైనా సమస్యను పరిష్కరించుకునే సమయంలో బల్లి కనబడితే అప్పుడు ఆ సమస్యను వదిలి పెట్టడం ఉత్తమమట.

మన దారికి అడ్డంగా బల్లి వస్తుంటే, మనం సరిగ్గా నిద్రపోవడం లేదని అర్థం అట.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.