Devotional

Lucky Mole:పుట్టు మచ్చలు ఏ చోట ఉంటే ఎలాంటి లాభాలు కలుగుతాయి

Lucky Mole Meaning :సాధారణంగా జాతకాలను చేతి గీతలు, పుట్టుమచ్చల ఆధారంగా చెప్పుతూ ఉంటారు. అయితే ఈ జాతకాలను మూఢనమ్మకం అన్ని కొంతమంది కొట్టిపారేసారు.

మరి కొంతమంది వాటిని నమ్ముతారు. ఇప్పుడు పుట్టుమచ్చ ఏ ప్రాంతంలో ఉంటే ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం.

* పుట్టుమచ్చ మీద వెంట్రుకలు ఉంటే కీర్తివంతులు మరియు ధనవంతులు అవుతారు.

* పురుషులకు రెండు కనుబొమ్మల మధ్య పుట్టుమచ్చ ఉంటె దీర్ఘాయుష్మంతుడవుతాడు.

* పురుషులకు తలలో పుట్టుమచ్చ ఉంటే గర్వం ఎక్కువ ఉంటుంది.

* నుదురు మీద పుట్టుమచ్చ ఉంటే కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు.

* నుదుటి కింది భాగంలో ఉంటే మంచి లక్ష్యాన్ని, ఏకాగ్రతను కలిగి ఉంటారు.

* పుట్టుమచ్చ కనుబొమ్మపై ఉన్నవారు కష్టపడి పనిచేస్తారు. ఈర్ష్య ఉండదు.

* ముక్కు మీద ఉన్నవారిలో క్రమశిక్షణ ఉండదు.

* చెవి భాగంలో ఉంటే సమాజంలో డబ్బుతో పాటు గౌరవం ఉంటుంది.

* పెదవిపై ఉంటే మీ బంధువుల పట్ల ఈర్ష్యను కలిగి ఉంటారు.

* బుగ్గపై ఉంటే రాజకీయాల్లో రాణిస్తారు.

* నాలుకపై ఉంటే మంచి వక్తగా ఉంటారు.

* గడ్డంపై పుట్టుమచ్చ ఉంటే అడ, మగవారిలో భిన్నమైన ఫలితాలు ఉంటాయి.

* గడ్డం మధ్యలో ఉంటే….మగవారు ఉదార భావం,ఆడవారు భక్తి భావంతో ఉంటారు.

* భుజంపై ఉంటే కస్టపడి పనిచేస్తారు. అలాగే మర్యాదస్తులుగా ఉంటారు.

* మోచేతిపై ఉంటే లక్ష్యాలు సాధించే క్రమంలో ఎదురుదెబ్బలు ఉంటాయి.

* మెడ భాగంలో ఉంటే కొన్నిసార్లు దురదృష్టం వెంటాడుతుంది. కొంతమంది మోసం చేసే అవకాశం ఉంది.

* కుడి కనుబొమ్మ మీద ఉంటే త్వరగా వివాహం అవుతుంది.

* కుడి కంటి రెప్పపై ఉంటే సంపద కలిగి ఉంటారు.

* శరీరం ముందు భాగంలో ఉంటే ఆకస్మికంగా ధన లాభం కలుగుతుంది.

* శరీరం వెనక భాగంలో ఉంటే ఎంత కష్టపడి పనిచేసిన ఫలితం వేరొకరికి వెళ్ళిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.