Healthhealth tips in telugu

Pregnant Women:గర్భవతులను భయపెట్టే ఇన్ఫెక్షన్స్

Pregnant Women:పండంటి పాపాయిని ఎత్తుకొని మురిసిపోవాలని గర్భవతులు కలలు కంటూ ఉంటారు. అయితే మాములుగా ఉన్న సమయం కంటే ఈ స్థితిలో స్త్రీలు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇన్ఫెక్షన్స్ గర్భవతి ఆరోగ్యాన్నే కాకుండా గర్భస్థ శిశువు యొక్క ఆరోగ్యాన్ని కూడా దెబ్బతిస్తాయి. గర్భవతులు ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.

గర్భవతులు ఇతరులు తిని వదిలేసినా ఆహారంను తినటం కానీ,ఇతరులతో కలిసి తమ ఆహారాన్ని తినటం కానీ చేయకూడదు. ఇలా చేయుట వలన త్వరగా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మాంసాహారం తినేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. పూర్తిగా ఉడికిన మాంసాన్ని మాత్రమే తినాలి. ఏ మాత్రం ఉడకపోయిన దానిని తినటం మంచిది కాదు.

పాలు పోషకహరమే. కానీ పచ్చి పాలను త్రాగకకూడదు. కాచిన పాలను మాత్రమే త్రాగాలి. పేస్ట్ కంట్రోల్ వృత్తిలో ఉన్న గర్భవతులు మరింత జాగ్రత్తగా ఉండటం మంచిది. వీటి ద్వారా వచ్చే వైరస్ గర్భస్థ శిశువుకు హాని కలిగించవచ్చు. ఇన్ఫెక్షన్ గురయినా వ్యక్తులకు దూరంగా ఉండాలి.

జలుబు,జ్వరం ఉన్నవారి దగ్గరకు వెళ్ళకుండా ఉండటమే మంచిది. అన్నింటి కన్నా ముఖ్యమైనది శుభ్రత. ఆహారం తీసుకొనేటప్పుడు,ద్రవ పదార్దాలు తీసుకొనేటప్పుడు తప్పనిసరిగా చేతులను సబ్బుతో కడుక్కోవాలి. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే పండంటి పాపాయిని ఒడిలో ఆడించవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.