Kitchenvantalu

Lizards : మీ ఇంట్లో ఉండే బ‌ల్లులు రెండు నిమిషాల్లో పారిపోవాలంటే.. ఇలా చేయండి..!

Lizards : బల్లులను చూడగానే మనలో చాలా మందికి చికాకు,విసుగును కలిగిస్తాయి. బల్లులు ఇంటిలో క్రిమి కీటకాలను తిని వాటి బెడద తగ్గించిన సరే బల్లులు ఎక్కువగా ఇంటిలో ఉంటె చాలా ఇబ్బందిగా ఉంటుంది. బల్లులను తరిమి కొట్టటానికి మార్కెట్ లో బల్లి నిరోధకాలు,విషాలు అందుబాటులో ఉంటాయి. అయితే వీటి కారణంగా చిన్న పిల్లలకు హాని కలగవచ్చు.

అందువల్ల ఇప్పుడూ చెప్పే చిట్కాలను అయితే ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా బల్లులను శాశ్వతంగా ఇంటి నుండి తరిమేయవచ్చు. ఇప్పుడు ఆ చిట్కాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ చిట్కాలకు ఉపయోగపడే అన్ని రకాల వస్తువులు మన ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేవే.

కాఫీ పొడి
కాఫీ పొడిలో పొగాకు పొడి కల్పి చిన్న చిన్న బంతులుగా తయారుచేసి,  టూత్ పిక్స్ తీసుకుని ఆ బంతులకు ఫిక్స్ చేయాలి. ఈ టూత్ పిక్స్ ను బల్లి మార్గం లేదా బల్లులు ఉండే ప్రదేశాలలో పెట్టాలి. ఈ మిశ్రమాన్ని బల్లులు తింటే చనిపోతాయి. కాఫీ వాసన బల్లులను ఆకర్షిస్తుంది.

నాఫ్తలిన్ బంతులు
నాఫ్తలీన్ బంతులు మంచి పెస్ట్ కంట్రోలర్ అని చెప్పవచ్చు. నాఫ్తలిన్ బంతులను మీ వార్డ్ రోబ్ లో,నీటి సింక్ లో లేదా స్టవ్ కింద లేదా బల్లులు ఎక్కువగా తిరిగే ప్రదేశాలలో పెట్టాలి. ఈ నివారణ బల్లులకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పనిచేస్తుంది. నాఫ్తలిన్ బంతుల వాసనకు బల్లులు పారిపోతాయి. ఈ చిట్కా చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది.

నెమలి ఈకలు
నెమలి ఈకలను చూసి బల్లులు భయపడతాయి. అందువల్ల బల్లులు ఎఎక్కువగా తిరిగే ప్రాంతంలో గోడలపై అక్కడక్కడ నెమలి ఈకలను అంటిస్తే బల్లులు పారిపోతాయి. అలాగే నెమలి ఈకలను ఫ్లవర్ వాజ్ లలో కూడా పెట్టవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News