Kitchenvantalu

Mango Pickle :ఆవకాయ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండి ముక్కుమెత్తబడకుండా ఉండాలంటే ఇలా చేయండి

Mango Pickle :మామిడికాయ పచ్చడి..సౌత్ ఇండియన్స్ ఆల్ టైం ఫేవరేట్ .ప్రతి ఇంట్లో ఉండే నోరూరించే మామిడి కాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
పచ్చడి మామిడి కాయలు – 2
కారం – 4 టేబుల్ స్పూన్స్
ఉప్పు – 3 టేబుల్ స్పూన్
ఆవాల పొడి – 1 ½ టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 3 టేబుల్ స్పూన్స్
తాలింపు కోసం..
జీలకర్ర – 2 స్పూన్స్
ఆవాలు – 2 టీ స్పూన్స్
ఎండుమిరప కాయ గింజలు – 1 -2 స్పూన్

తయారీ విధానం
1.ముందుగా జీలకర్ర మెంతులను గ్రైండ్ చేసిపెట్టుకోవాలి.
2.మామిడికాయలను ముక్కలుగా కట్ చేసుకోవాలి.
3.ఇప్పుడు తాలింపు కోసం బాణలీ లో మూడు ,నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకోవాలి.
4.అందులోకి ఆవాలు ,జీలకర్ర,ఎండుమిర్చి ,కరివేపాకు,అల్లం వెల్లుల్లి పేస్ట్ వుపి వేపుకోని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

5.తాలింపును పూర్తిగా చల్లారనివ్వాలి.
6.ఇప్పుడు మామిడి కాయ ముక్కలలోకి కారం,జీలకర్ర మెంతుల పొడి,మిగిలిన అల్లంవెల్లుల్లి పేస్ట్,చల్లారిన తాలింపు వేసి కలుపుకోవాలి.
7.అన్ని పదార్ధాలతో మామిడికాయ ముక్కలను బాగా మిక్స్ చేసుకోవాలి.
8.ఎయిర్ టైట్ కంటేనర్ లో తడి తగలకుండా స్టోర్ చేసుకోవాలి.
9.అంతే కమ్మని మామిడికాయ పచ్చడి రెడీ.