Beauty Tips

Dandruff:చుండ్రు సమస్య వేధిస్తోందా… ఈ చిట్కాలు ఫాలో అవ్వండి

Dandruff Home Remedies:చుండ్రు సమస్య అనేది ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తోంది. చలికాలం వచ్చిందంటే ఈ చుండ్రు సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. రెండు రోజులకోసారి తలస్నానం చేసిన చుండ్రు సమస్య వదలదు. ఈరోజు ఈ సమస్య నుంచి బయటపడటానికి కొన్ని చిట్కాలు తెలుసుకుందాం.

ఒక కప్పులో 3 స్పూన్ల అలోవెరా జెల్ మరియు 20 చుక్కల ట్రీ ట్రీ ఆయిల్ కలిపి జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే చుండ్రు సమస్య తొలగిపోతుంది.

రాత్రి సమయంలో మెంతులు నానబెట్టి మరుసటి రోజు మెత్తని పేస్ట్ గా చేసి జుట్టు కుదుళ్లకు పట్టించి గంటయ్యాక తలస్నానం చేస్తే చుండ్రు సమస్య అంతా మాయం అయిపోతుంది

బాగా పులిసిన పెరుగు లో నిమ్మరసం కలిపి జుట్టు కుదుళ్లకు పట్టించి అరగంటయ్యాక తలస్నానం చేస్తే చుండ్రు సమస్య నుంచి బయట పడవచ్చు ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే సరిపోతుంది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.