Gas problem:ఇవి తింటే గాస్ట్రిక్ సమస్యలను దూరం చెయ్యొచ్చు…!
Gas Problem Home Remedies:ప్రస్తుతం చాలా మంది పెద్ద వవస్సు ఉన్న వారే కాకుండా యూత్ కూడా భాధపడుతున్న సమస్య గ్యాస్ట్రిక్ ట్రబుల్.ఎందుకంటే ఇప్పుడు మనం తింటున్న రకరకాల ఆహర పధార్దాల వల్లే వయసు తేడా లేకుండా అందరికి ఇలాంటి ఇబ్బంది కలుగుతుంది.
చాలామంది స్పైసి,డెలీషియస్ ఫుడ్ అంటే చాలా ఇష్టం.అయితే ఇలాంటివి ఎక్కువగా తీసుకున్నప్పుడు పొట్ట ఉబ్బరంగా,గ్యాస్ తో ఉంటుంది. చాలా మందిని వేధించే గ్యాస్ర్టిక్ ప్రాబ్లమ్స్ చెక్ పెట్టడానికి అనేక రకాల హోం రెమిడీస్ ఉన్నాయి.కేవలం పొట్టలో సమస్యలో కాదు కొన్ని రకాల ఆహారాలు హార్ట్ బర్న్, ఎసిడిటీకి కూడా కారణమవుతాయి.
గ్యాస్ సమస్యతో తరచు భాధపడితే బోజనానికి ముందు అల్లం ముక్కను తింటే ఆ సమస్యలు దరి చేరవు. ఇక మనం తినే ఆహరంలో ఎక్కువగా వెల్లుల్లి ఉండే విధంగా చూసుకుంటే చాలా మంచిది. జీలకర్ర పొడిని కూడా మనం తినే ఆహరంలో వేసుకుని తింటే చాలా మంచిది.
సువాసన వచ్చే పొదీన తో టీ త్రాగడం కూడా చాలామంచిది.తులసి ఆకులని రసంగా చేసుకుని నీళ్ళల్లో కలుపుకుని తాగితే గ్యాస్ సమస్యలు దూరం అవుతాయి యాలకులు డైజెషన్ ప్రక్రియను ఇంప్రూవ్ చేస్తాయి. అలాగే గ్యాస్ ని అరికడతాయి.
యాలకును మరుగుతున్న నీటిలో వేసి 5 నుంచి 7 నిమిషాలు ఉంచాలి. తర్వాత నిదానంగా తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బెల్లం తో పాటు కొంచెం మిరియాల పొడి తీసుకుంటే గ్యాస్ సమస్యలకే కాదు డైజెషన్ ప్రాబ్లంస్ ను కూడా తగ్గిస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.