Healthhealth tips in telugu

Urine Infection:యూరిన్ కి వెళ్లకుండా ఎక్కువసేపు ఆపుకుంటే ఏమవుతుంది?

Urine Infection:సరైన సమయానికి మూత్రవిసర్జన (యూరినేషన్) చేయకుండా అలాగే బిగపట్టుకొని వుంటారు.. ఇది కొందరికి అలవాటుగా మారిపోతుంది. ఇంకొందరు జర్నీ చేసేటప్పుడు, ఏదైనా ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నప్పుడు, చుట్టు పక్కల సరైన సౌకర్యం లేనప్పుడు, తాము వర్క్ చేస్తున్న దగ్గర పరిశుభ్రమైన బాత్ రూంలు లేనప్పుడు ఇలా యూరిన్ ని బిగపట్టుకుంటారు. కాని ఇలా ఆపుకోవడం మంచిది కాదంటున్నారు వైద్యులు. ఇలా చేయడం వల్ల అనేక ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

శరీరం చెప్పిన సమయానికి వెళ్ళకపోతే యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. యూరినరీ ట్రాక్ లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలుంటాయి. యూరిన్ లో బాక్టీరియా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది బ్లాడర్ లో ఎక్కువ సమయం ఉంటె ఇన్ఫెక్షన్ కి దారి తీస్తాయి.

ఎక్కువసేపు యూరిన్ కి వెళ్లకుండా ఆపుకుంటే.. కిడ్నీల్లో స్టోన్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న కిడ్నీ స్టోన్స్ యూరిన్ ద్వారా బయటకు వెళ్లిపోతాయి. కానీ యూరిన్ కి వెళ్లకుండా ఆపుకుంటే అవి పెద్దవిగా మారుతాయి. అసలు కిడ్నీ స్టోన్ ఏర్పడకుండా ఉండాలంటే రోజుకి 3 నుండి 5 లీటర్ల నీరు తాగాలి. అలాగే తరచుగా యూరిన్ కి వెళ్ళాలి.

సమయానికి యూరిన్ కి వెళ్లకుండా ఆపుకుంటే.. బ్లాడర్ లోని గోడలలో వాపు వస్తుంది. ఆ తర్వాత సిస్ట్స్ గా మారే ప్రమాదముంది. ఒకవేళ మీకు యూరిన్ పాస్ చేసేటప్పుడు పెల్విక్ పెయిన్ రావడం, తక్కువ మోతాదులో యూరిన్ రావడం వంటి లక్షణాలన్నీ సిస్ట్స్ ని సూచిస్తాయి. కాబట్టి ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్ ని సంప్రదించాలి.

మన బ్లాడర్ కి చాలా తక్కువ కెపాసిటీ ఉంటుంది. ఇందులో కేవలం 3 కప్పుల లిక్విడ్స్ మాత్రమే నిల్వ ఉంచగలదు. ఈ విషయాన్ని తప్పక గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఏదైనా ముఖ్య మీటింగ్ లో ఉన్నప్పుడు, ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు, బాత్ రూంలు అందుబాటులో లేనప్పుడు ఎక్కువగా నీరు తాగకుండా ఉంటారు.ఇది చాలా ముఖ్యమైన విషయం.

ఎక్కువసేపు యూరిన్ ని బిగపట్టుకొని ఉంటె బ్లాడర్ లో నిల్వ ఉండే యూరిన్ మళ్లీ మూత్రాశయంలోకి, కిడ్నీలలోకి వెనక్కి వెళ్తుంది. దీనివల్ల ఎన్నో తీవ్రమైన ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యూరిన్ లో ఎన్నో రకాల యాసిడ్స్ ఉంటాయి. కావున ఎక్కువసేపు బిగపట్టుకుంటే అందులో ఉండే యాసిడ్స్ వల్ల నొప్పి కలగడం, గ్యాస్ ఫార్మ్ అవ్వడం లాంటివి జరుగుతాయి. ఈ సమస్యలు చాలా రోజుల వరకు వెంటాడే అవకాశాలు కూడా ఉన్నాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.