Kitchenvantalu

Onion Cutting:ఉల్లిపాయను కోసినప్పుడు కన్నీరు రాకుండా ఉండాలంటే….

onion cutting tears :మనం ఉల్లిపాయను కోసినప్పుడు కన్నీరు రావటం సహజమే. ఎందుకంటే ఉల్లిపాయలో సల్ఫర్ సమ్మేళనాలు ఉండుట వలన చాలా గాటుగా ఉంటుంది. ఉల్లిపాయను కోసినప్పుడు ఆ గాటు కారణంగా కన్నీరు వస్తుంది. అలాగే ఉల్లిపాయను కోసే కత్తి చాలా పదునుగా ఉండాలి.

ఉల్లిపాయను కోయటానికి ముందు చల్లని నీటిలో అరగంట సేపు ఉంచాలి. అలాగే రిఫ్రిజిరేటర్ లో రెండు గంటల పాటు ఉంచాలి.

ఉల్లిపాయను సగానికి కట్ చేసాక, ఒక నిమిషం పాటు పారే నీటి కింద ఉంచితే ఆ గాటు తగ్గుతుంది.

ఉల్లిపాయను కోసేటప్పుడు మీ నోటిలో బ్రెడ్ ముక్కను పెట్టుకోవాలి. ఈ విధంగా చేయుట వలన గాటును తక్కువగా పిల్చే అవకాశం ఉంటుంది.