Beauty Tips

Beautiful Feet:నల్లని పాదాలు తెల్లగా మెరవాలంటే ఇంటి చిట్కాలు

Beautiful Feet Home Remedies:అందమైన పాదాలు తేమ, చెమట, ప్రతి రోజు ఎక్కువగా నడవటం, సూర్యరశ్మి వంటి కారణాల వలన నల్లని పాదాలుగా మారతాయి. పాదాలు నల్లగా ఉంటే మనకు ఇష్టమైన బూట్లు మరియు చెప్పులు వేసుకోవటానికి కొంచెం కష్టం అవుతుంది. అప్పుడు నడవటానికి ఇబ్బందిగా ఉంటుంది.

సూర్యకాంతి నేరుగా పడటం వలన మృత కణాలు మరియు పొడి కారణంగా పాదాలు సహజ రంగును కోల్పోతాయి. ఇప్పుడు సహజంగా, కేవలం ఒక వారం రోజుల్లోనే ఇంటి నివారణలతో ఈ సమస్య నుండి బయట పడవచ్చు. ఇక్కడ నల్లని పాదాలను వదిలించుకోవటానికి కొన్ని సహజ నివారణలు ఉన్నాయి.

1. చక్కెర మరియు నిమ్మ స్క్రబ్
పాదాల నలుపును తొలగించుకోవటానికి స్క్రబింగ్ చేయటం ముఖ్యం. స్క్రబింగ్ చేయటానికి చక్కెర మరియు నిమ్మ బాగా సహాయపడతాయి.

కావలసినవి
నిమ్మకాయ – 1
చక్కెర – 1 స్పూన్

పద్దతి
* మొదట పాదాలను శుభ్రంగా కడిగి, ఆ తర్వాత గోరువెచ్చని నీటిలో కొంచెం సేపు ఉంచాలి.
* నిమ్మకాయను సగానికి కట్ చేసి దాని మీద చక్కెరను జల్లి స్క్రబింగ్ ప్రారంభించాలి.
* కనీసం 5 నుంచి 10 నిమిషాల పాటు స్క్రబింగ్ చేయాలి. ఆ తర్వాత 5 నిమిషాల పాటు అలా వదిలేయాలి.
* ఆ తర్వాత పాదాలను శుభ్రంగా కడిగి మాయిశ్చరైజర్ రాయాలి.

బయటకు వెళ్ళిన ప్రతిసారి సన్ స్క్రీన్ రాయటం మర్చిపోకూడదు. ఈ విధంగా ప్రతి రోజు ఒక వారం పాటు చేస్తే మంచి పలితాన్ని పొందవచ్చు.

2. పాలు
పాలలో ఉండే లాక్టిక్ ఆమ్లం చర్మ నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది. ఇది చర్మ టోన్ ను తగ్గించటమే కాకుండా పాదాలను మృదువుగా మరియు సున్నితంగా చేస్తుంది. గులాబీ రేకులు పాదాలకు మంచి వాసనను కలిగిస్తాయి.

కావలసినవి
పాలు – 1 కప్పు
కొన్ని గులాబీ రేకులు
వేడి నీరు

పద్దతి
* మొదట పాదాలను శుభ్రంగా కడగాలి.
* ఒక టబ్ లో ఒక కప్పు పాలు, కొన్ని గులాబీ రేకులు, రెండు కప్పుల వేడి నీటిని పోసి బాగా కలపాలి.
* ఈ టబ్ లో పాదాలను పెట్టి 20 నిముషాల వరకు అలా ఉంచాలి.
* ఆ తర్వాత చల్లని నీటితో పాదాలను శుభ్రంగా కడిగి పొడి వస్త్రంతో తుడవాలి.

3. శనగపిండి
ఈ ఇంటి నివారణలో పాదాల నలుపును తగ్గించే సామర్ధ్యం కలిగిన నాలుగు శక్తివంతమైన పదార్థాలు ఉన్నాయి.

కావలసినవి
శనగపిండి – 2 స్పూన్స్
దోసకాయ రసం – 1 స్పూన్
టమోటా రసం – 1 స్పూన్
నిమ్మరసం – 2 స్పూన్స్

పద్దతి
* మొదట పాదాలను శుభ్రం చేసుకొని,ఆ తర్వాత నెయిల్ పాలిష్ ని కూడా తొలగించాలి.
* ఒక బౌల్ లో శనగపిండి, దోసకాయ రసం, టమోటా రసం, నిమ్మరసం వేసి బాగా కలిపి పాదాలకు రాయాలి.
* ఆ తర్వాత 5 నిముషాల పాటు పాదాలకు మసాజ్ చేసి 20 నిముషాలు అలా వదిలేయాలి.
* బాగా ఆరిన తర్వాత శుభ్రంగా కడిగి పొడి వస్త్రంతో తుడవాలి.
* తడి ఆరిన పాదాలకు మాయిశ్చరైజర్ రాయాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.