Beauty Tips

Face Glow Tips;నల్లగా ఉన్న ముఖం కాంతివంతముగా మారాలంటే….BEST TIPS

Face Glow Tips:చాలా మంది ముఖం నల్లగా ఉందని బాధ పడుతూ ఉంటారు. ముఖం రంగు మారటానికి అనేక రకాల క్రీమ్స్,లోషన్స్ ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వాటికీ బదులుగా ఇంట్లో లభించే వస్తువులతో మీ ముఖాన్ని కాంతివంతముగా చేసుకోవచ్చు. ఈ క్రింద ఇచ్చిన చిట్కాలలో ఏదైనా ఒక దానిని పాటించి ముఖాన్ని మరింత కాంతివంతముగా చేసుకోవటానికి ప్రయత్నించండి.

ముఖం తెల్లగా నిగనిగలాడుతూ ఉండాలంటే మీగడలో పసుపు కలిపి ఈ మిశ్రమాన్ని ముఖమంతా సున్నితంగా మసాజ్ చేయాలి. ఒక అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా కొన్ని వారాల పాటు చేస్తే ముఖం కాంతివంతముగా మారుతుంది. ఒక్క ముఖమే కాకుండా శరీరం అంతా కూడా ఈ మిశ్రమాన్ని అప్లై చేసి స్నానం చేస్తే చర్మం రంగు క్రమేపి మారుతుంది.

తులసి ఆకుల రసం,నిమ్మరసం లను సమపాళ్ళలో తీసుకోని ముఖానికి పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

శనగపిండిలో కొద్దిగా పసుపు,వెన్న కలిపి ముద్దగా చేసి ఈ మిశ్రమాన్ని ముఖంతో సహా మొత్తం శరీరానికి పట్టించి అరగంట తర్వాత సున్నితంగా మసాజ్ చేస్తూ ఆరిన పిండిని తీసివేయాలి. ఈ విధంగా చేయుట వలన చర్మం లోపల వరకు శుభ్రపడి కాంతివంతముగా మారుతుంది.

బంగాళాదుంప రసాన్ని ముఖానికి పట్టించిన కూడా మంచి పలితం ఉంటుంది. వారంలో కనీసం రెండు సార్లు చేయాలి. అలాగే గంధం పొడిలో పసుపు,రోజ్ వాటర్ కలిపి ముఖానికి పట్టించండి. ఈ విధంగా కొన్ని వారాల పాటు చేస్తే మంచి పలితం కనపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.