Beauty Tips

Hair Care Tips:జుట్టు చిట్లిపోతుందా… అయితే ఈ ప్యాక్స్ ట్రై చేయండి

Hair Care Tips:జుట్టు ఊడిపోవటం అనేది చాలా మంది ఎదుర్కొనే అతి సాదారణ సమస్య. ఇది కాకుండా జుట్టు చివరలు పగిలి కాంతిని కోల్పోయినట్టు ఉంటాయి. ఈ సమస్యకు బ్యూటిపార్లర్ ను ఆశ్రయించటం కన్నా ఇంటిలోనే మీకు అందుబాటులో ఉండే వస్తువులతో ఈ సమస్యను అదికమించవచ్చు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మనం ఇంట్లో ఉండే వస్తువులతో కొన్ని ప్యాక్స్ ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాము.

బొప్పాయి ప్యాక్
జుట్టు పూర్వపు కాంతిని పొందాలంటే బొప్పాయి ప్యాక్ ను మించిన సాదనం లేదు. బాగా పండిన బొప్పాయి గుజ్జులో ఒక కప్పు పెరుగు కలిపి,జుట్టు కుదుళ్ళ నుండి చివర వరకు బాగా పట్టించాలి. ఒక అరగంట అయిన తర్వాత గోరువచ్చని నీటితో స్నానం చేయాలి. ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తే జుట్టు పూర్వ రూపం,అందం,కాంతి వస్తాయి.

క్రీం టానిక్
జుట్టును షాంపూ చేసుకున్నా తర్వాత అర కప్పు పాలలో టేబుల్ స్పూన్ క్రీం కలపాలి. దీనిని తల మొదలు నుండి చివర వరకు బాగా పట్టించాలి. ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తే మంచి పలితం కనపడుతుంది.

మినుమల ప్యాక్
అర కప్పు మినుములు,టేబుల్ స్పూన్ మెంతులు రెండింటిని పొడి చేసి అందులో అరకప్పు పెరుగు కలిపి ఈ మిశ్రమాన్ని తల మొదలు నుండి చివర వరకు పట్టించి రెండు గంటల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తే జుట్టు చివరలు చిట్లిపోవటం క్రమేపి తగ్గుతుంది.

ఆయిల్ ప్యాక్
ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ ఆయిల్,ఒక టేబుల్ స్పూన్ మస్టర్డ్ ఆయిల్ ఓకే టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి ఈ మిశ్రమాన్ని తల కుదుళ్ళ నుండి క్రింది వరకు బాగా పట్టించి,తర్వాత గోరువెచ్చని నీటితో తడిపిన టవల్ ను చుట్టి అరగంట అయిన తర్వాత స్నానం చేయాలి.

గుడ్డు
ఒక టేబుల్ స్పూన్ బాదం నూనె,గుడ్డులోని తెల్ల సోన,ఒక స్పూన్ తేనే కలిపి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే మంచి పలితం కనపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.