Health

Headache:భరించలేని తలనొప్పి ని కూడా ఒక్క నిమిషంలోనే తగ్గించే అద్భుతమైన చిట్కా!!

Headache:ఈ రోజుల్లో తలనొప్పి సర్వసాదారణమయిపోయింది. పని ఒత్తిడి, టెన్షన్, నిద్రలేమి, జన్యుపరమైన సమస్యలు ఇలా పలు కారణాలతో తలనొప్పి చాలా మందిని అమితంగా బాధిస్తోంది. తలనొప్పికి కారణమేదైనా తక్షణమే చికిత్స చేయించుకోవాలి. మనలో చాలామంది తలనొప్పి రాగానే ఇష్టం వచ్చినట్టు టాబ్లెట్లు వాడుతుంటారు. ఇది మంచి పద్దతి కాదు.

టాబ్లెట్లు వాడకుండా సహజసిద్దమైన పద్ధతుల ద్వారా తలనొప్పిని తగ్గించుకోవచ్చు. ఈ సారి మీకు తలనొప్పి వస్తే ఇక్కడ ఇచ్చిన సహజసిద్దమైన పద్దతులతో తలనొప్పిని తక్షణం ఎలా తగ్గించుకోవాలో కింద తెలుసుకుందాం. తద్వారా భరించలేని నొప్పి నుంచి ఉపశమనం పొంది ప్రశాంతత సాధించుకుందాం.

* ఒక స్ట్రాంగ్ ఎక్స్ ప్రేస్సో వంటి కాఫీని తీసుకొని అందులో తాజా నిమ్మరసం పిండుకొని తాగితే మీ తలనొప్పి మాటు మాయమవుతుంది.

* 250 మీ లీ వేడి నీటిలో సెయింట్ జాన్ వార్ట్ ఒక టేబుల్ స్పూన్ కలిపి 15 నిమిషాలు పక్కనపెట్టి వడకట్టి రోజుకు ౩ సార్లు తాగితే తలనొప్పి వెంటనే తగ్గుతుంది.

* ఎండు పుదీనా ఆకులు ఒక టేబుల్ స్పూన్ తీసుకొని 500 మిల్లీ లీటర్ల వేడినీటిలో కలిపి ఆ నీటిని అరగంట పాటు చల్లబరచండి. ఆ నీటిని వడగట్టి రోజుకు మూడు సార్లు తాగితే సరి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.