Healthhealth tips in telugu

Chips Packet:చిప్స్ ప్యాకెట్ లో గాలి ఎందుకు నింపుతారో మీకు ఎప్పుడయినా డౌటు వచ్చిందా?

Chips Packet: చాలా మంది చిప్స్ తింటారు కానీ ఆ ప్యాకెట్ లో గాలిని దేనికి నింపుతారనేది తెలీదు. చిప్స్ ప్యాకెట్ లో గాలి కూడా పెద్ద విషయమేనా అని తీసిపారేయకండి. అసలు విషయం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. కొందరకి ఇలాంటి ప్రశ్న మదిలో వచ్చే ఉంటుంది.

చిప్స్ ఏమో కొన్ని.. కానీ ప్యాకెట్ చూడటానికి మాత్రం గాలితో నిండి ఫుల్ గా ఇస్తారు ఏంటబ్బా అని జుట్టు పీక్కుంటారు. చిన్న పిల్లలకి అయితే ఏడుపు ఒక్కటే తక్కువ ఛీ చిప్స్ కొన్నే వచ్చాయని. ఇక అసలు విషయానికి వస్తే చిప్స్ ప్యాకెట్ లో నైట్రోజన్ వాయువుని నింపుతారట. ఇలా ప్యాకెట్ లో ఎందుకు నింపుతారంటే..

చిప్స్ తయారయ్యాక వాటిని తరలించే సమయంలో చిప్స్ అనేవి కొన్ని రోజులు నిల్వ ఉండాలి మరియు తరలించే సమయంలో చిమ్ప్స్ అనేవి విరిగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే చిప్స్ అనేవి పాడవకుండా ఉండటానికి మరియు ముక్కలు ముక్కలుగా అవ్వకుండా ఉండటానికి ప్యాకెట్ లో నైట్రోజెన్ వాయువుని నింపుతారట.

ఇప్పుడు అయినా తెల్సింది కూడా ఇప్పటి నుండి చిప్స్ తక్కువ వచ్చాయని ఫీల్ అవ్వకండి జర. ఇక ఆరోగ్య నిపుణులు మాత్రం ఆ చిప్స్ తింటే శరీరానికి ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు. మంచి ఆరోగ్యం కోరుకునే వారు చిప్స్ తినకపోవడమే మంచిదని సలహా ఇస్తున్నారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.