Beauty Tips

Fenugreek for Hair:జుట్టు సమస్యలకు మెంతులను వాడుతున్నారా… అయితే చూడండి

Fenugreek for Hair:జుట్టుకు ఉన్న అన్ని రకాల సమస్యలకు పరిష్కారం చూపటానికి మెంతులు చాలా బాగా సహాయపడుతాయి. మెంతుల లో ఉన్న పోషకాలు చుండ్రు, పొడి జుట్టు, చివర్లు చిట్లిపోవడం వంటి ఎన్నో సమస్యలను తగ్గిస్తాయి. మెంతులలో ప్రోటీన్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.

మూడు స్పూన్ల మెంతులలో మూడు స్పూన్ల కొబ్బరి నూనెను కలిపి మెత్తని పేస్ట్ గా చేసి జుట్టుకు బాగా పట్టించి రెండు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి అరగంట తర్వాత తల స్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

కొబ్బరి పాలల్లో మెంతి పౌడర్ కలిపి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్టుని జుట్టుకు బాగా పట్టించి రెండు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి పావుగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండు నుంచి మూడుసార్లు చేస్తూ ఉంటే జుట్టు పొడిబారటం తగ్గి తేమగా ఉంటుంది జుట్టు పొడిగా మారి చుండ్రు సమస్య వచ్చేస్తుంది. చుండ్రు సమస్య ఉన్నప్పుడు కూడా ఈ ప్యాక్ చాలా బాగా సహాయపడుతుంది

మందార ఆకులు 5 తీసుకుని దానిలో నానబెట్టిన మెంతులు వేసి మెత్తని పేస్టులా చేయాలి ఈ పేస్ట్ ను జుట్టుకు పట్టించి అరగంటయ్యాక తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే జుట్టు పట్టుకుచ్చులా మృదువుగా ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."