Beauty Tips

Eyebrows Grow Thick:ఐబ్రోస్ నల్లగా ఒత్తుగా రావాలంటే… బెస్ట్ టిప్స్

Eyebrows Grow Thick:కళ్ళు అందంగా ఆకర్షణీయంగా కనపడాలి అంటే ఐబ్రోస్ అందంగా ఉండాలి అందుకే మనలో చాలామంది ఐబ్రోస్ అందంగా తీర్చిదిద్దు కోవడానికి నానా పాట్లు పడుతుంటారు. ఐబ్రోస్ కొంతమందికి నల్లగా ఒత్తుగా ఉంటాయి. కొంతమందికి సరిగా పెరగవు. అలాంటివారు ఈ టిప్స్ పాటిస్తే ఐబ్రోస్ నల్లగా ఒత్తుగా పెరుగుతాయి.

ఈ చిట్కా చాలా సింపుల్. ఇంచుమించు ప్రతి ఇంట్లో కలబంద మొక్క అనేది ఉంటుంది. కలబంద చిన్న ముక్కను తీసుకుని దానిలో నుంచి జెల్ తీసి ఐబ్రోస్ ఫై రాసి రెండు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి రోజూ చేస్తూ ఉంటే ఐబ్రోస్ నల్లగా ఒత్తుగా పెరుగుతాయి.

ఐబ్రోస్ నల్లగా ఒత్తుగా పెరగడానికి ఉల్లిపాయ చాలా బాగా సహాయపడుతుంది. ఉల్లిపాయలు పేస్టు లాగా తయారు చేసి రసం తీసుకోవాలి. ఆ రసాన్ని ఐబ్రోస్ మీద రాయాలి. ఈ రసం కంటిలో పడకుండా జాగ్రత్త పడాలి. పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఐబ్రోస్ కి ఆలివ్ ఆయిల్ రాసి సున్నితంగా మసాజ్ చేయాలి. ఆలివ్ ఆయిల్ లో విటమిన్ ఎ ఈ సమృద్ధిగా ఉండటం వలన హాయ్ బ్రోస్ నల్లగా ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."