Healthhealth tips in telugu

Drinking Soda:ఇది చదివితే సోడా త్రాగటానికి భయపడతారు

side effects of Drinking Soda :సోడా ప్రస్తుతం వున్న ఆధునికరణ జీవితంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న పానీయం. దీనికి యువకులే కాదు పెద్ద వారు దాసొహాం అవుతున్నారు. ఎంతగా ఏ పార్టీ కి వెళ్ళినా , భోజనం చేస్తున్నా దాహాంగా దీనిని అధిక ప్రయారీటీని ఇస్తున్నారు. కాని దీని వల్ల ఎన్నో అనర్దాలు వున్నాయి. అవేంటో ఒక సారి చూద్దాం.

1. సోడాలో సిట్రిక్ ఆసిడ్, అధిక మొత్తంలో చక్కెరలు వుంటాయి. దీని వల్ల దంతాల పై వున్న ఎనామిల్ అనే పోర ప్రమాదానికి గురవుతుంది. అలాగే వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల దంతాక్షయం బారిన పడే అవకాశం వుందని ” జెజియాంగ్ విశ్వవిద్యాలయం సైన్స్ ” వారు వారి పరిశోధనలలో కనుగొన్నారు.

2. కార్బోనేటేడ్ సోడాను ఎక్కువగా తాగడం వల్ల ఎముకలు బలహీనపడతాయి.

3. ” అమెరికన్ జర్నల్స్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషియన్ ” వారు చేసిన పరిశోధనలలో సోడా వల్ల గుండె పోటుకు గురయ్యే ప్రమాదం ఎక్కువ అని తేలింది.

4. సోడాలోని కృత్రిమ చక్కెర సమ్మేళనాలు శరీర బరువును పెంచడమే కాకుండా ఉబకాయం వచ్చే అవకాశాలను అధికంగా చేస్తుంది.

5. మధుమేహాం ముప్పు సోడా తాగడడం వల్ల అధికంగా వుంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.