MoviesTollywood news in telugu

Tollywood లో ఒక్క హిట్ తర్వాత మన హీరోలకు ఎన్ని ప్లాప్స్ వచ్చాయో?

Tollywood Heroes Hits And Flops : మన అభిమాన హీరోల సినిమాలు హిట్ అవుతూ ఉంటాయి. అలాగే కొన్ని సినిమాలు ప్లాప్ అవుతూ ఉంటాయి. స్టార్ హీరోలు వరుస హిట్స్ అందుకున్నాక, ప్లాప్ లు చవిచూస్తే, హిట్ కోసం చాలా తపిస్తారు. ఫాన్స్ కూడా ఎంతగానో ఆతృతగా చూస్తారు. మెగాస్టార్ చిరంజీవి చూడాలని ఉంది మూవీ తర్వాత హిట్ కోసం తపించాడు.
Chiranjeevi Dance Skills
కొన్ని సినిమాలు వచ్చినా ఫలితం లేదు. దాంతో ఇంద్ర మూవీ వచ్చాక ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. నందమూరి నటసింహం బాలయ్య లక్ష్మీనరసింహ మూవీ తర్వాత వరుస ప్లాప్ లు వచ్చాయి. అయితే బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలయ్యకు అదిరిపోయే బ్రేక్ వచ్చింది. ఇక టాలీవుడ్ మన్మధుడు నాగార్జున కింగ్ సినిమా తర్వాత హిట్ పడలేదు. దాదాపు 10 మూవీస్ వచ్చినా హిట్ రాకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డాడు.
King Nagarjuna Paisley Silk Shirt Cost
చివరకు అక్కినేని హీరోలు అందరూ కల్సి చేసిన మనం సినిమా స్పెషల్ హిట్ గా నిల్చింది. విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో ఈ మూవీ వచ్చింది. విక్టరీని ఇంటిపేరుగా మార్చుకున్న వెంకటేష్ కి కొన్ని ప్లాప్ లు వచ్చాయి,. తులసి మూవీ వచ్చినా లాభం లేదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు మూవీ నిలబెట్టింది. పవన్ కళ్యాణ్ తొలిప్రేమ తర్వాత పెద్దగా హిట్స్ పడలేదు.

ఖుషి మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. అయితే జల్సా వచ్చే దాకా హిట్ పడలేదు. ఇక గబ్బర్ సింగ్ తర్వాత గ్రాఫ్ రేంజ్ అమాంతం పెరిగింది. ఇక యంగ్ హీరోస్ విషయానికి వస్తే, సింహాద్రి తర్వాత మళ్ళీ రాజమౌళి డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ కి యమదొంగ వచ్చే దాకా హిట్ దక్కలేదు. ప్రభాస్ కి ఛత్రపతి తర్వాత హిట్ రాక, డార్లింగ్ తో హిట్ కొట్టాడు.

పరుగు తర్వాత చేసిన నాలుగు సినిమాలు దెబ్బతిన్నాయి.దాంతో జులాయి మూవీతో సూపర్ హిట్ కొట్టాడు. రామ్ చరణ్ నాయక్ తర్వాత ఎదురుదెబ్బలు చూసి రంగస్థలం తో హిట్ అందుకున్నాడు. మాస్ మహారాజ్ రవితేజ మిరపకాయ్ తర్వాత బలుపు మూవీ వచ్చేదాకా ప్లాప్ లు రుచిచూసాడు. కళ్యాణ్ రామ్ అతనొక్కడే తర్వాత పటాస్ వచ్చేదాకా హిట్ రాలేదు. రానా, శర్వానంద్, బెల్లంకొండ శ్రీనివాస్ వంటివాళ్ళు కొన్ని ప్లాప్ ల తర్వాత హిట్ కొట్టారు.