Healthhealth tips in telugu

Rasam Rice:ప్రతి రోజు రసం అన్నం తినటం వలన ఎన్ని లాభాలో తెలుసా?

Rasam Rice Benefits :వర్షాకాలంలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే.. బెండ, సొరకాయలూ, చేమదుంపలూ తీసుకోవాలి. కాకరకాయ తింటే హాని చేసే పలు ఇన్‌ఫెక్షన్లు దూరమవుతాయి. దానిమ్మ, అరటి, బొప్పాయి తీసుకోవడం వల్ల అవసరమైన పోషకాలు అందుతాయి.

ఇంకా వర్షాకాలంలో జీర్ణక్రియ మెరుగ్గా ఉండేందుకు ప్రతిరోజూ రసం అన్నం తింటే మంచిది. రసంలోని టమోటాలు, చింతపండు, మిరియాలు, కరివేపాకులో పోషకాలు పుష్కలం.

అందుకే రసం తీసుకోవడం ద్వారా శరీరానికి అందుతాయి. టొమాటోల్లో యాంటీఆక్సిడెంట్లూ, విటమిన్‌ సి ఉంటాయి. ఇవి రోగనిరోధశక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇన్‌ఫెక్షన్లను అదుపులో ఉంటాయి. జబులు, దగ్గు వంటివి దరిచేరవు. బరువు తగ్గేవారికి ఇది మంచి ఆహారం. శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి. జీవక్రియ రేటు మెరుగుపడుతుంది.

అలాగే వర్షాకాలంలో రోజూ అల్లం టీలో, నిమ్మరసం తేనె కలుపుకుని తీసుకుంటే బరువు తగ్గుతారు.

వర్షాకాలంలో ఏర్పడే ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఈ టీ చక్కటి పరిష్కారం చూపుతుంది. టీలో లభించే పోషకాలు కీళ్లు, కండరాలను దృఢం చేస్తాయి. దగ్గు, జలుబు నుంచి ఉపశమాన్నిస్తాయి. శ్వాసకోశ సంబంధ సమస్యలూ ఇబ్బందిపెట్టవు.

ఉదయం పూట వికారంగా అనిపించినా తగ్గుతుంది. ఇంకా కూరల్లో పసుపు, మెంతులూ, ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. ఇవి పలు రకాల ఇన్‌ఫెక్షన్లతో పోరాడతాయి. ఇవి జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరిచి రోగనిరోధక శక్తిని పెంచుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.