Healthhealth tips in telugu

Drink Water:నీరు ఎక్కువగా త్రాగితే ఏమవుతుందో తెలిస్తే….షాక్

water intake per day :ప్రతి మనిషికి రోజూ ఆహరం, నీరు ఎంతో అవసరం. మనిషి ఒక రోజూ ఆహారం తీసుకోకుండా అయినా ఉండగలడు కాని నీరు తాగకుండా మాత్రం ఉండలేడు. మనిషికి నీరు ఎంతో అవసరం. మనిషి జీవితంలో నీరు ప్రముఖ పాత్ర వహిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. మంచి ఉన్న ప్రతి చోట చెడు కూడా ఉంటుంది.

నీరు ఆరోగ్యానికి ఎంతో మంచిది అని అందరికీ తెలుసు. మరి దాని వల్ల కలిగే అపాయం మాత్రం చాలా మంది తెలియదు. నీరు ఎక్కువగా తాగాలని చాలా మంది చెబుతుంటారు. అయితే మోతాదు మించితే అవి కూడా ప్రమాదమేనని అంటున్నారు నిపుణులు. నీరు ఎక్కువగా తాగటం వల్ల కలిగే అపాయం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మనిషి కి నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆహారం జీర్ణం కావడంలో నీరు ప్రముఖ పాత్ర వహిస్తుంది. చెమట ద్వారా శరీరంలో ఉష్ణోగ్రతను తగ్గించి, మలినాలను కూడా బయటకు పంపుతుంది నీరు. నీటి ద్వారా ఇన్ని ప్రయోజనాలున్నా మోతాదు మించి తీసుకుంటే మాత్రం ప్రాణాలకే ప్రమాదమని అంటున్నారు వైద్యులు.

మనిషి శరీరంలోని రక్తనాళాల్లో ఆస్మో రెసెప్టర్స్, బారో రెసెప్టర్స్ అనే రెండు రకాల గ్రాహకాలు ఉంటాయి. ఇవి రెండు రక్తంలో ద్రవపరిమాణం, ద్రవ గాఢతను పర్యవేక్షిస్తుంటాయి. ఈ పర్యవేక్షణలో ఏది ఏమాత్రం తగ్గినా మెదడుకు ఇవి సంకేతాలను అందజేస్తాయి. ఆ సమయంలో మనకు దాహం అవుతుంది. మనషుల్లో పురుషుల శరీరంలో 60%, స్త్రీలో 55% నీరుంటుంది. చిన్న పిల్లల శరీరంలో నీటి శాతం కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా(అవసరానికి మించి) నీరు తీసుకోకూడదని నిపుణులు అంటున్నారు.

నీరు ఎక్కువ తీసుకోవడాన్ని ఓవర్ హైడ్రేషన్ అంటారని, 75 కేజీల లోపు బరువు ఉన్న వ్యక్తి తక్కువ సమయంలో ఆరు లీటర్ల నీటిని తీసుకుంటే అతని ప్రాణానికే ముప్పు ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలక్ట్రోలైట్ సమతౌల్యత దెబ్బతిని బ్రెయిన్ ఫంక్షన్స్ ఆగిపోయి అనంతరం మనిషి ప్రాణానికే ప్రమాదమని చెబుతున్నారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.