Healthhealth tips in telugu

Acidity:ఎసిడిటి(గ్యాస్) తగ్గటానికి అద్భుతమైన ఇంటి చిట్కాలు

Acidity home remedies :కడుపులో జీర్ణ ఆమ్లాలు హెచ్చు తగ్గుల కారణంగా కడుపు నొప్పి, గ్యాస్, వికారం, చెడు శ్వాస వంటివి వస్తాయి. ఈ సమస్య అన్ని వయస్సుల వారిని భాదిస్తుంది. ఈ సమస్యను ఇంటిలో ఉండే సులభమైన వస్తువులను ఉపయోగించి తగ్గించుకోవచ్చు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

తులసి
తులసి ఆకులలో ఉండే లక్షణాలు పొట్ట ఉబ్బరం,గ్యాస్ వికారం వంటి వాటికీ తక్షణ ఉపశమనం కలిగిస్తాయి. కొన్ని తులసి ఆకులను నమలవచ్చు. అలాగే రెండు కప్పుల నీటిలో కొన్ని తులసి ఆకులను వేసి మరిగించి ఆ నీటిని త్రాగవచ్చు.

దాల్చిన చెక్క
దాల్చినచెక్క జీర్ణ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఒక సహజ ఆమ్ల హారిణి గా పనిచేస్తుంది. కడుపులో గ్యాస్ ను తరిమివేయుటానికి సహాయపడుతుంది. ఒక కప్పు నీటిలో అరస్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి మరిగించి ఆ నీటిని వడకట్టి త్రాగాలి.

మజ్జిగ
ఎసిడిటి వలన వచ్చే కడుపునొప్పి,గ్యాస్ వంటి వాటిని చాలా సమర్ధవంతంగా తరిమికొట్టే సామర్ధ్యం మజ్జిగకు ఉంది. ఒక స్పూన్ మెంతులను నానబెట్టి మెత్తని పేస్ట్ గా చేసి గ్లాస్ మజ్జిగలో కలిపి త్రాగాలి. అదనపు రుచి కోసం కొంచెం నల్ల మిరియాల పొడి,కొత్తిమీర కలపవచ్చు.

ఆపిల్ సైడర్ వెనిగర్
ఆపిల్ సైడర్ లో వెనిగర్ లో అల్కలిన్ కడుపులో ఆమ్ల చికిత్సకు సహాయపడుతుంది. ఒక కప్పు నీటిలో రెండు స్పూన్ల ఆపిల్ సైడర్ లో వెనిగర్ కలిపి త్రాగాలి. ఈ విధంగా రోజులో రెండు సార్లు త్రాగితే మంచి పలితాలు కనపడతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.